కమెడియన్ ఆలీ ఇటీవల పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఆలీ మరో కాంట్రవర్సీ కామెంట్లకు తెరలేపి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఆలీ ఈ సారి తన తోటి కమెడియన్ కం హీరో అయిన సునీల్‌ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కమెడియన్‌గా సినీరంగంలోకి ప్రవేశించి హీరోలుగా మారినవారు చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం, అలీ, వేణుమాదవ్ దగ్గర్నుంచి ఇప్పటి సప్తగిరి వరకు ఆ జాబితా చాలా పెద్దదే ఉంది.
అయితే వీరిలో సునీల్ డిఫరెంట్. కమెడియన్ నుంచి హీరోగా మారిన తర్వాత సునీల్ మళ్లీ కమెడియన్‌గా వేషాలు వేయలేదు. మిగిలిన కమెడియన్లు మాత్రం హీరోలుగా మారినా తర్వాత కూడా కమెడియన్ వేషాలు వేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుత జనరేషన్ కమెడియన్లలో దూసుకుపోతోన్న సప్తగిరి హీరోగా తెరకెక్కిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఆడియో వేడుకలో సీనియర్ కమెడియన్ అలీ.. హీరోలుగా మారిన కమెడియన్‌ల గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ కమెడియన్లు హీరోలుగా మారతారు.
అయితే అది ఓ లాటరీ లాంటిది. అది తగిలినప్పుడు వెంటనే జేబులో పెట్టుకుని రిలాక్స్ అవ్వాలి. మళ్లీ మళ్లీ లాటరీ కోసం టిక్కెట్టు కొంటే బుక్ అవుతాం.. మనం ఎప్పుడూ కమెడియన్‌గానే కొనసాగాలని సప్తగిరికి సలహా ఇచ్చాడు. అయితే ఆలీ చేసిన ఈ కామెంట్లు సునీల్‌ను టార్గెట్‌గా చేసుకుని వేసిన సెటైర్లే అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఆలీ ఈ కామెంట్లు చేసినప్పుడు పక్కనే సునీల్ ఉన్నాడు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ముందు హిట్లు కొట్టినా తర్వాత వరుస ప్లాపులతో కేరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే.
Related
