- Advertisement -
బీజేపీ ఎంపీ, సినీ నటీ కంగనా రనౌత్‌కి షాక్ తగిలింది. ఆమె తెరకెక్కిస్తున్న ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు (CBFCని) ఆదేశించలేమని క్లారిటీగా చెప్పేసింది.
అలాగే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది బాంబే హైకోర్టు. సెప్టెంబర్ 18వ తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని సీబీఎఫ్ సీకి సూచించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ మూవీని తెరకెక్కించారు కంగనా.
ఆమె స్వీయ దర్శకత్వంలో, కంగనా కథానాయికగా తెరకెక్కగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమా చిత్రీకరించారని విడుదలపై పలువురి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఇవేమి పట్టించుకోని కంగనా సినిమా పూర్తి చేసిన సెన్సార్ రూపంలో బ్రేక్ పడింది.