నంద్యాల ప్ర‌జ‌ల‌కు ఆర‌చేతిలో వైకుంఠం చూపుతున్న‌ గ్రాఫిక్స్ నారాయ‌ణ‌

Minister Narayana campaign starts in Nandyal By Election

రండీ బాబు…రండీ   నంద్యాల‌లో  మంత్రి నారాయ‌ణ  ఇంద్ర‌జాల …మ‌హేంద్ర జాల ప్ర‌ద‌ర్శ‌న‌..మించిన త‌రుణం మ‌ళ్లీరాదు.రంగురంగుల న‌గ‌రాలు,మేడ‌లు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా.అక్క‌డికే వ‌స్తున్నా.అదే నండి నంద్యాల ఉప ఎన్నిక త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంది.అందుకే టీడీపీ మొద‌లు పెట్టింది ఇంద్ర‌జాల  ప్ర‌ద‌ర్శ‌న‌. త్వ‌ర‌లో జ‌రిగే నంద్యాల ఉప ఎన్నిక వ్య‌వ‌హారం తారాస్థాయికి చేరింది.ఈ ఎన్న‌క‌ను ఎలాగైనా గెల‌ప‌వాల‌ని నాయ‌కుల‌ను బాబు ఆదేశించ‌డంతో క్యాష్‌బ్యాగ్‌తో మంత్రి నారాయ‌ణ వాలిపోయారు.ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నంద్యాల‌కు ఏంచేయ‌క‌పోయినా….ఇప్పుడు మాత్రం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు రంగురంగు బొమ్మ‌ల సినిమాలు చూపిస్తున్నారు.

{loadmodule mod_custom,GA1}
 
గ‌తంలో అమ‌రావ‌తి ప్ర‌జ‌ల‌కు రాజ‌ధాని ఎలా ఉంటాద‌నేది  3డీ ద్వారా చూపించారు.ఇప్పుడు అదే 3డీ గ్రాఫిక్స్ మాయాజాల‌న్ని నంద్యాల ప్ర‌జ‌ల‌కు చూపిస్తున్నారు.ఇప్పుడు 120 రోజుల ప్రణాళిక అంటూ ఓటర్లకు త్రీడీ చిత్రాన్ని చూపిస్తోంది. ఓట‌ర్ల‌కు కార్లు, ట్రాక్టర్లు కూడా పంచేందుకు సిద్ధమైంది. దీని బట్టి నారాయణ అండ్‌ టీం ఏ రేంజ్‌లో నంద్యాలలో నగదును మ‌ద్యంలా పారిస్తుందోన్నమాట‌.
ఇప్పటికే శిల్పా వర్గానికి చెందిన వారిని జన్మభూమి కమిటీల నుంచి తప్పించారు. రేషన్ డీలర్‌ పోస్టులనుంచి తొలగించారు.వైసీపీకి ప‌ట్టున్న నంద్యాల, గోస్సాడు మండలాల్లోని బీసీ మహిళలకు 3వేల కుట్టు మిషన్లు ,బ‌లిజ‌సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి 1500 కుట్టు మిష‌న్లు ఇచ్చేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేశారు.
{loadmodule mod_custom,GA2}
 
ప్ర‌త సామాజిక వ‌ర్గానికి తాయిలాలు వేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కూడా అయిన నారాయణ… నంద్యాలలో రోడ్లు విస్తరిస్తాం, డ్రైనేజ్‌ నిర్మాణం చేపడుతామంటూ గ్రాఫిక్స్ బొమ్మలను తీసుకుని తిరుగుతున్నారు.ఎప్పుడూలేని విధంగా కులాల వారీగా తాయిలాలు ప్ర‌క‌టించ‌డం చూస్తె అర్థ‌మ‌వుతుంది నారాయ‌ణ ఏరేంజ్‌లో జిమ్మిక్కులు చేస్తున్నారో.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
{youtube}sL4nrFh894w{/youtube}