నాయ‌కులు త‌యారు చేసుకోవాలి… లాక్కుంటెరారు… !

Chandrababu Naidu Comments in Nandyal at Kurnool tour

ఏపీసీఎం నారాచంద్ర‌బాబు నాయుడు ఒక్కోసారి అతితెలివాగా మాట్లాడుతుంటారు. పార్టీనుంచి ఎవ‌రు వెల్లినా న‌ష్టంలేద‌ని అలాంటి వారిని వంద‌ల‌మంది త‌యారుచేస్తామ‌ని సెల‌విస్తుంటారు అమాత్యులు. నాయ‌కుల‌ను త‌యారు చేసె పార్టీకి …నాయ‌కులు కావాలంటూ ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌జారీ చేశారు.

టీడీపీకి కుప్ప‌లు తెప్ప‌లుగా నాయ‌కులున్నారు. మ‌ళ్లీ నాయ‌కుల కొద‌వేంటో టీడీపికి… క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో పార్టీ క్యాడ‌ర్‌ముందు బాబు పార్టీకి కొత్త నాయ‌కులు కావాల‌ని మొర‌పెట్టుకున్నారు. శిల్పామోహన్‌రెడ్డి, పార్టీకి గుడ్‌ బై చెప్పాక మొత్తం జిల్లాలో టీడీపీ అడ్రస్‌ గల్లంతయ్యిందనే భావనకు చంద్రబాబు వచ్చేసినట్టున్నారు. అవును, చంద్రబాబు ఆందోళనలో అంత అర్థమూ కన్పిస్తుంది తరచి చూస్తే.

{loadmodule mod_custom,GA1}

ఇప్ప‌టికే క‌ర్నూలు జిల్లాలో కేయీ కృష్ణ‌మూర్తి, శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, భూమా వ‌ర్గంలాంటి నాయ‌కులు ఉన్నారు. కాని బాబుకు మాత్రం కొత్త‌నాయ‌కులు కావాల‌ని అంటున్నారు. బ‌హూశ దీన్ని బ‌ట్టి చూస్తె బాబు ఎవ‌రినీ న‌మ్మేప‌రిస్థితుల్లో లేర‌నుకోవాలి.పార్టీలో ఎవ‌రూ ఉండ‌రేమోనన్న సంకేతాలు బాబుకు వెల్లిన‌ట్టున్నాయి.
ఇవ‌న్నీ చూస్తె చంద్ర‌బాబే త‌న చేష్ట‌ల ద్వారా బ‌య‌ట‌కు పంపేలా చేస్తున్నారు. అధికారంలో ఉన్నా అబ‌ద్ర‌తాభావంతో బాబు కొట్టుమిట్టాడుతున్నారు.వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేల‌ను లాక్కున్న బాబు…ఇంకా నాయ‌కుల కొర‌త ఉంద‌ని అన‌డం ఏమ‌నుకోవాలి.నాయ‌కుల‌ను త‌యారు చేసుకోవాలెగాని….ఇత‌ర పార్టీనుంచి లాక్కుంటె త‌యార‌వ్వ‌రు అన్న‌స‌త్యం ఇప్పుడు బాబుకు బోద‌ప‌డిన‌ట్లుంది.నాయ‌కులు కావాలంటె రాష్ట్ర‌వ్యాప్తంగా ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఇవ్వాలి.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}BEpqWqyqr2o{/youtube}