ప్రేమలో గెలవలేదు.. అందుకే పెళ్లి చేసుకోను : సుడిగాలి సుధీర్

sudigali sudheer said him before love failure

జబర్ధస్త్ అనే షో ద్వారా బుల్లితెరపై ప్రేమక్షకులను తెగ అలరిస్తున్నాడు కమెడియన్ సుడిగాలి సుధీర్. ఈ కామెడీ షో ద్వారా సుధీర్ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు. కేవలం బుల్లితెరపైనే కాకుండా.. సినిమాలో కూడా అవకాశం దక్కిచుకుంటూ.. ముందుకు వెళ్తున్నాడు.

అయితే జబర్ధస్త్ లో చేస్తున్న సుధీర్ కి.. రష్మీకి సంబంధం ఉందని.. సుధీర్ తో రష్మీ డీప్ గా డేటింగ్ చేస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అయితే.. ఇవన్నీ రూమర్లు అని కొందరు అంటే.. మరి కొంత మంది.. మాత్రం నిజమే అనే అంటున్నారు. ఏకంగా జబర్ధస్త్ షోలోనే వీరి ఎఫైర్ పై మిగిలిన కామెడీ యాక్టర్లు సెటైర్లు వేస్తున్నారు. స్కిట్లలోనూ వీరిద్దరి పేర్లు జోడించే ఆటాడేసుకుంటున్నారు.

{loadmodule mod_custom,GA1} 

అది సరిపోదన్నట్లు.. డీ జోడి లో కూడా వీరిద్దరే మెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. అందులో విరిద్దరిపైన ఫన్నీ టక్స్ లు ఉంటాయి అందులో కూడా బాగా రేచ్చిపోతరు సుదీర్ అండ్ రష్మీ. దాంతో వీరిద్దరి పైన తెగ రూమర్స్ వచ్చాయి. కానీ ఇదంతా రూమరే అనీ, తనకూ రష్మీకి మధ్య ఏమీ లేదని మొదటినుంచీ చెప్తూనే ఉన్నాడు సుధీర్. అసలు అమ్మాయిలంటే తనకు పడదని.. తన జీవితంలో లవ్‌లో ఓసారి ఫెయిలయ్యానని, అప్పటి నుంచి అమ్మాయిల వెంట కన్నెత్తి చూసిందిలేదని అన్నాడు. ఇలాంటి పుకార్ల వల్ల తనకొచ్చే పెళ్లి సంబంధాలు పోతున్నాయని, ఎవరూ పిల్లనివ్వడానికి కూడా రాలేని స్థితి వస్తోందని నవ్వుతూ చెప్పాడు సుధీర్. తన తండ్రి.. తనతో కలిసి పనిచేసే ఫ్రెండ్స్‌ని అన్నీ ఎంక్వైరీ చేస్తారని చెబుతూ తనకు పెళ్లీ గిల్లీ ఏమీ ఇష్టంలేదని చెబుతుంటానని అన్నాడు. ఫ్రెండ్స్‌తో సరదాగా బెంగళూరు, చెన్నై వెళ్లి ఎంజాయ్ చేస్తానే తప్పా.. తాను తిరుగుబోతును కాను అని చెప్పుకొస్తున్నాడు సుధీర్. లైఫ్ లో మాత్రం పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంటున్నాడు సుడిగాలి సుధీర్.

{youtube}3Yha8UTl0v4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రాజమౌళి దర్శకత్వంలో సుడిగాలి సుధీర్ సినిమా..?
  2. జబర్ధస్త్ సుడిగాలి సుధీర్.. ఇంట్లో తారల సందడి
  3. రష్మీ, సుధీర్‍ల పెళ్లి.. ఎక్కడో తెలుసా..?
  4. అందరి ముందు.. సుధీర్ కి ముద్దు పెట్టి షాక్ ఇచ్చిన రష్మీ