- Advertisement -
తమిళనాడు, ఆంద్రా , కర్ణాటక రాష్ట్రాలని ఒకానొక సమయం లో గడగడ లాడించిన వీరప్పన్ ఇప్పుడు లేకపోయినా అక్కడి అడవులలో వారు అతన్ని దేవుడుగా కొలుస్తారు, పోలీసులు అతన్ని కడతేర్చిన తరవాత అతని భార్యా పిల్లలు కూడా అజ్ఞాతం లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.
రెండు రాష్ట్రాల్లో వేలాది ఏనుగుల్ని హతమార్చి వాటి దంతాలని , చందనం దుంగలనీ వీరప్పన్ స్మగ్లింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరవాత 2004 లో ఎస్టీఎఫ్ బలగాల చేతిలో వీరప్పన్ హతం అయ్యాడు. వీరప్పన్ మృతదేహం సేలం జిల్లాలో కలత్తూరు సమీపంలో మూలకాడు లో ఖననం చేసారు ఈ క్రమంలో పోయిన ఆదివారం వీరప్పన్ 11 వ సంస్మరణ దినం కావడం తో మూలక్కడమ మేమ్చేరి లో చాలా చోట్ల అతని బ్యానర్ లు, పోస్టర్ లు కనపడ్డాయి. దాని కింద ఆయన భార్య పేరు కనపడ్డం లో అనుమతి లేకుండా అవి అంటించారు అని ఆమె మీద పోలీసులు కేసు పెట్టారు