పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ డోపింగ్ పరీక్షలో దోషిగా తేలాడు. అతడు నిషేదిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు రుజువైంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది.షెహజాద్ పాకిస్తాన్‌లోనిర్వహించిన పరీక్షల్లోనే డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైందని, కానీ భారత్‌లోని ల్యాబ్‌కు పంపించి పీసీబీ మరోసారి నిర్ధారించుకుందని డాన్ పత్రిక పేర్కొంది.
ఇక డోప్ టెస్టులో విఫలమైన పాక్ క్రికెటర్లలో షెహజాద్ మొదటి వాడేం కాదు.. 2012లో డోప్ టెస్టులో విఫలమైన పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజా హసన్ రెండేళ్ల నిషేదం ఎదుర్కొనగా యాసిర్ షా, అబ్దుర్ రెహమాన్‌లు తాత్కాలిక నిషేదాలు ఎదుర్కొన్నారు.