Monday, April 29, 2024
- Advertisement -

T20 WORLDCUP 2022 : కూనలను తక్కువగా అంచనా వేస్తే.. అడ్రెస్ గల్లంతే !

- Advertisement -

ఆస్ట్రేలియాలో జరుగుతున్నా ఈ టి20 వరల్డ్ కప్ లో మొదటి నుంచి కూడా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా క్రికెట్ లో ఓనమాలు నేర్చుకుంటున్న చిన్న జట్లు బడా జట్లకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నాయి. పెద్దగా అంచనాలు లేని పసికూనలు దిమ్మ తిరిగే ఫలితాలను రాబడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టోర్నీ ప్రారంభంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, టీమిండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా వంటి జట్లపై పైనే అందరి దృష్టి ఉంది. కానీ టోర్నీ ప్రారంభం అయ్యాక.. ఐర్లాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్ వంటి జట్లు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టి20 క్వాలిఫయిర్ మ్యాచ్ లలో ఎవ్వరూ ఊహించని విధంగా రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ జట్టును, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలు మట్టికరిపించాయి..

ఫలితంగా వరల్డ్ వరల్డ్ బెస్ట్ టి20 జట్టుగా పేరుతెచ్చుకున్న వెస్టిండీస్ టోర్నీకి క్వాలిఫై కాకుండానే నిష్క్రమించింది. ఇక టోర్నీ ప్రారంభంలో శ్రీలంకపై నమీబియా ఏకంగా 55 పరుగుల తేడాతో గెలుపొంది.. లంకేయులకు గట్టి షాకే ఇచ్చింది. ఇక సూపర్ 12 లో భాగంగా దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఇంగ్లండ్ జట్టును .ఐర్లాండ్ జట్టు ఓడించడంతో.. పసికూనలను తక్కువగా అంచనావేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అనే సంకేతాలను గట్టిగానే పంపింది ఐర్లాండ్ జట్టు.

ఇక నిన్నటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై జింబాబ్వే జట్టు ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్ పై జింబాబ్వే జట్టు పైచేయి సాధించింది. ఇక నెదర్లాండ్ జట్టు కూడా టీమిండియా కు గట్టి పోటీనే ఇచ్చిందనే చెప్పాలి. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాను 179 పరుగులకే కట్టడి చేయడంలో నెదర్లాండ్ సక్సస్ అయింది. దీంతో నెదర్లాండ్ ఓడిపోయినప్పటికి.. ఆ జట్టు ఇచ్చిన పోటీ బడా జట్టును తలపించేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి కూనలే కదా అని లైట్ తీసుకుంటే.. ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్, వంటి జట్ల నుంచి ప్రమాదం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -