రెండో టెస్ట్‌లో భార‌త్ ఘోర ఓట‌మి

అంద‌రు అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది.ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో భార‌త్ ఘోర ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. 287 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 140 పరుగులకే కుప్పకూలింది. టాపార్ట్‌ర్‌తో పాటు లోయ‌ర్ ఆర్డర్ సైతం చేతులు ఎత్తేయ‌డంతో భార‌త్ ఓట‌మిపాలైంది.

112/5 ఓవర్‌ నైట్‌స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 28 పరుగులు జోడించి చేతులెత్తేసింది. స్టార్క్‌, లయన్‌లు మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఉమేశ్‌ యాదవ్‌(2), ఇషాంత్‌ శర్మ(0), బుమ్రా(0)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని 4 టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.