రాఘవ లారెన్స్ … డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత దర్శకుడిగా మారాడు. ఆతరువాత తన దర్శకత్వంలోనే హీరోగా నటించి సక్సెస్ అయ్యాడు లారెన్స్. అతను దర్శకత్వం వహించి, నటించిన కాంచన సిరీస్ ఎంతటి హిట్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమాను రెడీ చేశాడు లారెన్స్.కాంచన-3 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు లారెన్స్.
రుద్రాక్షలు ధరించిన వయస్కుడిగా స్టైల్‌గా లారెన్స్ కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఈ పోస్టర్, ఆయన అభిమానులను ఆకట్టుకునేదిగా ఉంది. గత కాంచన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కాస్తా భిన్నంగా కనిపిస్తున్నాడు లారెన్స్. ఈ సినిమాలో నిక్కీ తంబోలి, ఓవియా హీరోయిన్లుగా నటించారు. లారెన్స్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాను నిర్మించాడు. గత సినిమాల మాదిరిగాన ఈ సినిమాను థ్రిల్లర్ , కామెడిగా తెరకెక్కించాడు లారెన్స్.తమిళ, తెలుగు భాషలలో కాంచన-3ఏప్రిల్ 18వ తేదీన చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!