Friday, March 29, 2024
- Advertisement -

ఆకట్టుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ సీత లుక్కు!

- Advertisement -

‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న భారీ బ‌డ్జెట్‌ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అలియా భ‌ట్ లుక్ విడుద‌లైంది. రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జ‌క్కన్న తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఆర్ ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ, నా సీత ఇదిగో అంటూ చెర్రీ ఈ లుక్‌ను విడుద‌ల చేశారు. చీర క‌ట్టి, బొట్టు పెట్టి ఉన్న ఆమె లుక్ అల‌రిస్తోంది. రామ‌రాజు కోసం ఎదురుచూపులు చూస్తున్న‌ట్లు ఆమె కూర్చొని ఉంది. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక సీత‌గా అలియా లుక్ అదిరిపోయింద‌ని నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అజయ్ దేవగణ్‌, ఇంటర్నేషనల్ స్టార్స్ రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సౌత్ స్టార్ సముద్రఖని, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.

విండీస్-లంక మధ్య జరిగిన చివరి వన్డేకు తెనేటీగలు షాక్..!

మళ్లీ లాక్ డౌన్ పై అందరి దృష్టి.. ఆయన ఏం అన్నారంటే..!

తెలంగాణ హాట్ టాపిక్.. గవర్నర్ కి స్వాగతం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -