Saturday, April 27, 2024
- Advertisement -

లారెన్స్ న్యూ మూవీ.. మోషన్ పోస్టర్ తోనే మెప్పించారు..!

- Advertisement -

రాఘవ లారెన్స్ డాన్స్ మాస్టర్లలో అగ్రగన్యుడిగా పేరు సంపాదించాడు. తెలుగు తమిళ భాషల్లో అగ్రహీరోలందరికీ చక్కటి పాటలందించాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి మాస్, డాన్ వంటి సినిమాలు చేశాడు. ప్రభాస్ తో చేసిన రెబల్ ప్లాప్ కావడంతో అప్పటి నుంచి లారెన్స్ తమిళ సినిమాలకే పరిమితమయ్యాడు. ముని సినిమాతో హీరోగా మారిన లారెన్స్ అప్పట్నుంచి హీరోగానే కొనసాగుతున్నాడు. ఎక్కువగా హార్రర్ సినిమాలు, విభిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమాలు మాత్రమే చేస్తున్నాడు.

తాజాగా లారెన్స్ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం ‘అధిగారం’. ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ,కథనం, మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమాకు దురై సెంతిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ఇవాళ విడుదలైంది. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది.

లారెన్స్ మొదటిసారి ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. పెద్ద మీసాలతో గంభీరంగా కనిపిస్తున్నాడు. మొత్తానికి అధిగారం ఫస్ట్ మోషన్ పోస్టర్ తోనే ఆకట్టుకున్నారు. వెట్రిమారన్ తమిళ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన అసురన్ తో పాటు వడ చెన్నై, విసా రనై, ఆడుకాలం ఘన విజయం సాధించాయి. విభిన్న చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు అధిగారం మూవీకి కూడా వెట్రిమారన్ విభిన్న కథాంశాన్ని అందించినట్లు సమాచారం.

Also Read

ఐకాన్ మూవీలో బన్నీ రోల్ పై షాకింగ్ న్యూస్…!

ఈ సారైనా నిధి ఫేట్ మారుతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -