టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు బిగ్ రిలీఫ్ కలిగింది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఇద్దరు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వీరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సీఓఏ ఇద్దరినీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేసినా.. సీఓఏ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇద్దరిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.అమికస్ క్యూరీ పీఎస్ నరసింహతో సంప్రదింపులు జరిపిన తర్వాత సస్పెన్షన్‌ను ఎత్తేయాలని నిర్ణయించారు. విచారణాధికారిని సుప్రీంకోర్టు నియమించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5న దీనిపై కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.
తాజాగా ఆ సస్పెన్షన్‌కి కమిటీ ఎత్తి వేయడంతో.. ఇద్దరు క్రికెటర్లు త్వరలోనే న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లేందుకు మార్గం సుగుమమైంది. టాక్ షోలో తాము చేసిన వ్యాఖ్యలకి హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ ఇప్పటికే క్షమాపణలు కోరగా.. బీసీసీఐ పాలకుల కమిటీ మాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ.. తాజాగా యువ క్రికెటర్ల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని ఆ సస్పెన్షన్‌ని ఎత్తివేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.