Monday, May 20, 2024
- Advertisement -

లక్నోకు షాక్..కేఎల్ రాహుల్ గుడ్‌ బై?

- Advertisement -

ఐపీఎల్ 2024లో ఆరంభంలో అదరగొట్టిన లక్నో తర్వాత పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇక ప్రధానంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో బౌలర్లు చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్‌ ఘోర ఓటమి తర్వాత లక్నో ఫ్రాంఛైజీ ఓనర్‌ సంజీవ్ గొయెంక – రాహుల్ మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది.

దీంతో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉండకూడదని రాహుల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక వచ్చే సీజన్‌లో రాహుల్‌ని రిటైన్ కూడా చేసుకోదని వార్తలు వస్తుండగా దాదాపు లక్నోను వీడటం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్‌ను రూ.17 కోట్లకు దక్కించుకుంది లక్నో.

ఇక గురువారం ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. 242 పరుగుల భారీ టార్గెట్‌ని చేధించే క్రమంలో పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ 92 పరుగులతో రాణించి మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -