బాహుబలి సినిమాలో కట్టప్పగా యాక్ట్ చేసిన సత్యరాజ్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కొద్దిసేపటికే అరెస్ట్ అయింది సత్యరాజ్ కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు ఆయన అభిమానులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎండీఎంకే పార్టీ నేత సత్యరాజ్ బాలుని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో అందరు నటుడు సత్యరాజ్‌ను అరెస్ట్ చేశారని భావించారు.
ఈ విషయంపై మీడియాలో కూడా వార్తలు రావడంతో అందరు సత్యరాజ్ అరెస్ట్ అయ్యారని అనుకున్నారు. తరువాత అసలు విషయం తెలియడంతో హమ్మయ్య అనుకున్నారు. గత ఆదివారం నరేంద్ర మోదీ తమిళనాడులోని మదురైలో పర్యటనను వ్యతిరేకిస్తూ ఎండీఎంకే కార్యకర్తలు నినాదాలు చేశారు. దీనిలో భాగంగానే ఎండీఎంకే పార్టీ నేత సత్యరాజ్ బాలుని పోలీసులు అరెస్ట్ చేశారు.బాహుబలి సినిమాతో సత్యరాజ్ నేషనల్ లేవల్లో క్రేజ్‌సంపాదించిన సంగతి తెలిసిందే.
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభం
- అశ్లీల పరిశ్రమను చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్ యోచన!
- కొంత వరకే కొత్త మ్యాప్‌నకు మద్దతు: భారత్
