Monday, April 29, 2024
- Advertisement -

బాబు ఎత్తుగ‌డ‌కు చెక్ పెట్టిన ప్ర‌తిప‌క్షాలు….

- Advertisement -

పుణ్య‌కాలం కాస్త గ‌డిచిపోయాక ఎన్నిక‌ల వేల చంద్ర‌బాబు కొత డ్రామాల‌కు తెర‌లేపుతున్నారు. భాజాపాతో నాలుగు సంవ‌త్స‌రాలు క‌ల‌సి ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేక‌హోదాకు తిలోద‌కాలిచ్చి తీరా ఎన్నిక‌ల స‌మ‌యంలో తెగ హ‌డావుడీ చేస్తున్నారు. కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించినందుకు భాజాపా నేత‌ల‌కు స‌న్మాలు చేసి ఇప్పుడేదో కొంప‌లు అంటుకున్న‌ట్లు కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ప్ర‌జ‌ల‌ల్లో మైలేజీ కోసం నానా తంటాలు ప‌డుతున్నారు.

భాజాపాతో అంట‌కాగిన‌ప్పుడే అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకితీసుకెల్లింటే రాష్ట్రానికి కొంతైనా ప్ర‌యోజ‌నం ఉండేది. త‌న రాజ‌కీయా అవ‌స‌రాల‌కోసం తాజాగా అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని హ‌డావుడిగా ఏర్పాటు చేశారు. బాబు జిత్తుల‌ను ప్ర‌తిప‌క్షాలు తిప్పికొట్టాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో వైసీపీతో పాటు జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు, భాజాపా అఖిల‌ప‌క్షానికి హాజ‌రు కాకుండా షాక్ ఇచ్చాయి.

నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసి, హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టించిన చంద్రబాబు తీరా ఇప్పుడు ఎన్నికల ముందు అఖిలపక్ష సమావేశాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని వివిధ పార్టీల నేతలు మండిపడ్డారు. గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన కాంగ్రెస్, వామపక్షాలు కూడా భేటీకి దూరం జరగడం గమనార్హం. త‌న అవ‌స‌రాల‌కోసం బాబు చేస్తున్న జిమ్మిక్కులు న‌మ్మేప‌రిస్థితుల్లో లేవు ప్ర‌తిప‌క్ష‌పార్టీలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -