భారత దేశ ఏకైక యుద్ద విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ మృతి చెందారు. కర్ణాటకలోని కర్వార్ ఓడ రేవుకు చేరుకుంటున్న సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం సంభవించింది. కంపార్ట్‌మెంట్‌పై చెలరేగిన మంటలను ఆర్పే క్రమంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ మృతి చెందారు.మంటలు అదుపులోకి వచ్చే సమయానికి పొగ కారణంగా అధికారి అపస్మారకస్థితిలో వెళ్లాడు. వెంటనే చికిత్స నిమిత్తం నేవీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. షిప్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకముందె సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంపై దర్యాప్తునకు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.ష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య జనవరి 2014లో భారత నౌకాదళంలో చేరింది. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు. 60 మీ పోడవు, 284 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల ఎత్తుతో 44,500 టన్నుల బరువు కలిగి ఉంటుంది. మొత్తం 35 యుద్ధ విమానాలను ఒకేసారి మోసుకెళ్లే సామర్థ్యం విక్రమాదిత్యకు సొంతం.
- Advertisement -
ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో అగ్రిప్రమాదం….ఒకరు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
