- Advertisement -

మ‌రో ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌….

- Advertisement -

తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న తప్పిదాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. రీ-వాల్యుయేషన్, రీ-వెరిఫికేషన్‌కు ప్రభుత్వం పూనుకున్నా… ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది. నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం కోడ్రోన్ పల్లి గ్రామానికి చెందిన శిరీష ఈరోజు ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంట‌ర్‌లో ఒక స‌బ్జెక్టు త‌ప్ప‌డంతో యువతి ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రాణాలు తీసుకున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య 22కు చేరుకుంది. మరోవైపు శిరీష మరణంపై కేసు నమోదు చేసిన నారాయణపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -