Sunday, May 5, 2024
- Advertisement -

గుండెపోటుతో ఆస్ప‌త్రిలో చేరిన విండీస్ స్టార్ మాజీ క్రికెట‌ర్ బ్రియాన్ లారా…

- Advertisement -

వెస్టిండీస్ స్టార్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. ఛాతినొప్పితో ఇబ్బందిపడుతున్న ఆయన ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. వరల్డ్‌కప్‌ టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్‌ ఛానల్‌‌లో విశ్లేషణలు అందించేందుకు ఇటీవల ముంబయికి వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే అతనికి ఒకసారి గుండె పోటు వచ్చి ఉండటంతో.. ఈరోజు రెండోసారి స్ట్రోక్ వచ్చిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న లారా అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.కెరీర్‌లో మొత్తం 299 వన్డేలాడిన లారా.. ఏకంగా 10,405 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. అలానే 131 టెస్టులాడిన ఈ విండీస్ దిగ్గజం 11, 953 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్రియాన్ లారా 2007లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -