అమితాబ్​ ఇల్లు కూల్చివేత..!

- Advertisement -

బాలీవుడ్​ సూపర్​స్టార్​, బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ ఎంతో ప్రేమగా ముంబైలో నిర్మించుకున్న ‘ప్రతీక్ష’ బంగ్లాను .. బృహాన్‌ ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్​ (బీఎంసీ) అధికారులు కూల్చేయబోతున్నట్టు సమాచారం. ప్రతీక్ష బంగ్లా ఎంతో అందంగా ఉంటుంది. ఓ చారిత్రక కట్టడాన్ని తలపిస్తుంది. కేవలం ఈ ఇంటిని చూసేందుకు కూడా ముంబై వెళ్లే వాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ఈ బంగ్లా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ.. రోడ్డు విస్తరణలో భాగంగా ఈ బంగ్లాను కూల్చేయాలని బీఎంసీ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

ప్రతీక్ష బంగ్లా ఓ అక్రమ కట్టడం అంటూ కాంగ్రెస్‌ నేత తులిప్‌ బ్రియాన్‌ మిరండా ఎంతో కాలంగా డిమాండ్​ చేస్తున్నాడు.
‘2017లో రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ప్రతీక్షకు బృహాన్‌ ముంబై మున్సిపాలిటీ కార్పోరేషన్‌(బీఎంసీ) నోటీసుల కూడా జారీ చేసింది. కానీ ఆ నోటీసులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ భవనం ఓ సామాన్యుడిది అయి ఉంటే బీఎంసీ ఇలాగే వ్యవహరించి ఉండేదా’ అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

Also Read: బాలీవుడ్ బడా స్టార్ రెండో భార్యకూ విడాకులు ఇచ్చాడు..!

దీంతో బీఎంసీ అధికారులు ప్రతీక్ష బంగ్లాను కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి అమితాబ్​ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొనే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇప్పటివరకు అమితాబ్​, ఆయన కుటంబసభ్యులు ఎటువంటి స్పందన తెలియజేయలేదు. కానీ ఈ భవానాన్ని అమితాబ్​ బచ్చన్​ ఎంతో ఇష్టంగా కట్టించుకున్నారు.

Also Read: టిక్​టాక్​ వచ్చేస్తోంది..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -