జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్ల కిందట జనసేన పార్టీ ప్రారంభించారు. ఎన్నికల తర్వాత పవన్ మొన్నీమధ్యే తిరుపతి, కాకినాడ సభలతో మళ్లీ రాజకీయ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదాపై కోసం పవన్ కేంద్రమంత్రి వెంకయ్యను, ఏపీ ఇతర మంత్రులను ముందుకొచ్చి పోరాడాలని సూచించాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రులంతా ప్రత్యేక హోదా మా వల్ల కాదని చేతులెత్తేస్తే.. పవన్ మాత్రం హోదా కోసం పోరాడుతానని స్పష్టం చేశాడు.
ఇక ఆ తర్వాత కాటమరాయుడు షూటింగ్ లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్.. మళ్లీ పొలిటికల్ తెరమీద ఎప్పుడు కనిపిస్తారన్నది ఎవరికీ అంతుచిక్కని అంశం. పొలిటికల్ గా జనంతో ఎప్పుడూ టచ్ లో ఉండేలా సోషల్ మీడియా వేదికగా జనసేనను యాక్టివ్ చేశారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి సంబంధించి ఫేస్ బుక్, ట్విట్టర్ లలో జనసేన అధికారిక పేజీ ప్రారంభమైంది.
దీని ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు.. పార్టీకి సంబంధించిన ఓ ప్రాక్టికల్ థియరీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ బుధవారం టీజర్‌ను విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన సమాచారం, పార్టీ సిద్ధాంతాలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయనుంది. యూట్యూబ్ లో విడుదల చేసిన జనసేన టీజర్‌ను చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు.
{youtube}EPG6EKiHoBM{/youtube}
Related