Sunday, May 5, 2024
- Advertisement -

పోస్టల్ బ్యాంకులో 1710 ఉద్యోగాలు…

- Advertisement -

-డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీఏ అభ్యర్థులకు అవకాశం

-అనుభవం ఉన్నవారికి ఉన్నత పదవులు

-ఆకర్షణీయమైన జీతభత్యాలు

-100 శాతం ప్రభుత్వ ఈక్విటీ బ్యాంక్

-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్

-ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఇటీవలే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా, 100 శాతం ప్రభుత్వ ఈక్విటీతో ప్రారంభమైయ్యింది.

– స్కేల్ -1, స్కేల్ – 2 ఆఫీసర్స్ పోస్టులు

 పోస్టులు – ఖాళీలు:

– సీనియర్ మేనేజర్ (బ్రాంచీ) – 350 పోస్టులు. ఇవి ఎంఎంజీఎస్ -3 కేటగిరీ పోస్టులు.

-మేనేజర్ (ఏరియా సేల్స్) – 250 ఖాళీలు. ఇవి ఎంఎంజీఎస్ – 2 కేటగిరీ పోస్టులు.

-మేనేజర్ (ఏరియా ఆపరేషన్స్) – 350 ఖాళీలు. ఇవి ఎంఎంజీఎస్ -2 కేటగిరీ పోస్టులు.

-సీనియర్ మేనేజర్ (సేల్స్ ఆపరేషన్) – 2 పోస్టులు. ఇవి ఎంఎంజీఎస్ -3 కేటగిరీ పోస్టులు.

-సీనియర్ మేనేజర్ (యూఐ/యూఎక్స్) – 1 పోస్టు. ఇవి ఎంఎంజీఎస్ -3 కేటగిరీ పోస్టులు.

-సీనియర్ మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్) – 3 ఖాళీలు, సీనియర్ మేనేజర్ (మర్చంట్ ప్రొడక్ట్స్) – 2, సీనియర్ మేనేజర్ (గవర్నమెంట్ ప్రొడక్ట్స్) – 2, మేనేజర్ (ప్రొడక్ట్ రిసెర్చ్) – 1, మేనేజర్ (యూజర్ ఎక్స్‌పీరియన్స్) – 2, సీనియర్ మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్) – 1, సీనియర్ మేనేజర్ (బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్) – 1, సీనియర్ మేనేజర్ (ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్) – 1, మేనేజర్ (అకౌంట్ పేబుల్) – 1, మేనేజర్ (టాక్సేషన్) – 1, మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) – 1, మేనేజర్ (టీఎస్ అండ్ ఆర్) – 1, మేనేజర్ (ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీస్) – 1, సీనియర్ మేనేజర్ (ట్రెయినింగ్) -1, సీనియర్ మేనేజర్ (హెచ్‌ఆర్) – 2, మేనేజర్ (ట్రెయినింగ్) – 1, మేనేజర్ (హెచ్‌ఆర్ జనరలిస్ట్ మ్యాన్‌పవర్ ప్లానింగ్ అండ్ రిక్రూట్‌మెంట్) – 2, మేనేజర్ (కార్పొరేట్ హెచ్‌ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్) – 1, మేనేజర్ (బ్రాంచ్ హెచ్‌ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్) -4, మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) – 1, మేనేజర్ (హిందీ సెల్) – 1, సీనియర్ మేనేజర్ (రిస్క్ అండ్ కాంకరెంట్ ఆడిట్) – 2, మేనేజర్ (ఫ్రాడ్ కంట్రోల్ ఆపరేషన్స్) – 4, సీనియర్ మేనేజర్ (కస్టమర్ సర్వీస్) – 4, సీనియర్ మేనేజర్ (సెల్ సెంటర్) – 1, సీనియర్ మేనేజర్ (బ్రాంచీ ఆపరేషన్స్) – 4, సీనియర్ మేనేజర్ (చెక్ ట్రంకేషన్ సిస్టం) -3, సీనియర్ మేనేజర్ (ఆర్) – 3, మేనేజర్ (కస్టమర్ అక్విటేషన్ సపోర్ట్) – 16, మేనేజర్ (వెండర్ ఫర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్) – 3, సీనియర్ మేనేజర్ (కంప్లయింగ్ సపోర్ట్ అండ్ రిపోర్టింగ్) – 2, సీనియర్ మేనేజర్ (సిస్టమ్/ డాటాబేస్ అడ్మినిస్ట్రేషన్) – 5, సీనియర్ మేనేజర్ (సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్) – 5, సీనియర్ మేనేజర్ (నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్టచర్ అడ్మినిస్ట్రేషన్) – 5, సీనియర్ మేనేజర్ (ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్) – 3, మేనేజర్ (వెండర్/ హార్డ్‌వేర్ సర్వీసెస్) – 2, మేనేజర్ (డిజిటల్ టెక్నాలజీ ఇన్నోవేషన్) -1 ఖాళీలు ఉన్నాయి.

వయస్సు, అర్హతలు వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

– పేస్కేల్: ఎంఎంజీఎస్ – 3 పోస్టులకు – నెలకు రూ. 1,06,000/-

 – ఎంఎంజీఎస్ – 2 పోస్టులకు – నెలకు రూ. 83, 000/-

 -ప్రొబేషనరీ పీరియడ్: ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు నుంచి ఏడాది పాటు ప్రొబేషనరీ పీరియడ్‌గా పరిగణిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ

– ఆన్‌లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫై అయినవారిని ఉద్యోగాల సంఖ్యను బట్టి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్

– దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అక్టోబర్ 7 నుంచి

– చివరితేదీ: నవంబర్ 1

 

650 స్కేల్ – 1 ఆఫీసర్స్

 భారత ప్రభుత్వ పరిధిలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ స్కేల్ – 1 ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ (టెరిటరీ) – జేఎంజీఎస్ – 1 స్కేల్ పోస్టు.

– ఖాళీల సంఖ్య – 650. వీటిలో జనరల్ – 327, ఓబీసీ – 176, ఎస్సీ – 98, ఎస్టీ – 49. (ఓహెచ్ – 7, హెచ్‌హెచ్- 7, వీహెచ్ – 7 పోస్టులు కేటాయించారు)

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 2016, సెప్టెంబర్ 1 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

వయస్సు: 20 – 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

– పేస్కేల్: రూ. 23,700- 42,000/- (నెలకు సుమారుగా రూ. 65,000/- వరకు వస్తుంది)

– ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు

 ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా

– ప్రిలిమినరీ ఎగ్జామ్: ఇంగ్లిష్ – 30, రీజనింగ్ ఎబిలిటీ – 35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 35 మార్కులకు ఇస్తారు. మొత్తం 100 మార్కులు.

– పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.

– ఐపీపీబీ నిర్ణయించిన కటాఫ్ మార్కులను సాధించిన వారిని మెయిన్ ఎగ్జామ్‌కి ఎంపిక చేస్తారు.

మెయిన్ ఎగ్జామ్: – రీజనింగ్ – 50, ఇంగ్లిష్ లాంగ్వేజ్ – 50, కంప్యూటర్ నాలెడ్జ్ – 20, జనరల్ అవేర్‌నెస్ (బ్యాకింగ్ ప్రత్యేకం) – 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 50 మార్కులు.

– మొత్తం 200 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.

-పరీక్ష కాలవ్యవధి – 140 నిమిషాలు.

-మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.

– ఇంటర్వ్యూకు 100 మార్కులు.

-మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులకు 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ద్వారా తుది ఎంపిక చేస్తారు.

నోట్: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోత విధిస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్

– దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

– చివరితేదీ: అక్టోబర్ 25

– పరీక్షతేదీ: 2016 డిసెంబర్/ 2017, జనవరిల్లో నిర్వహిస్తారు.

-ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 150/-, ఇతరులకు రూ. 700/- (ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి)

వెబ్‌సైట్: https://www. indiapost.gov.in

Related

  1. తెలంగాణా ఖాళీ చేసిన ఆంధ్రా ఉద్యోగులు
  2. అక్కడ..ఉద్యోగులు నగ్నంగా పని చేస్తున్నారు!
  3. ఓ ఉద్యోగి కేసు తారుమారు
  4. మరో 1,069 ఉద్యోగాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -