- Advertisement -

పవన్ కళ్యాణ్ దేవుడు అయ్యాడు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్లో కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు. శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ ఏ సినిమా చేయబోతున్నాడు అనే విషయంపై అప్పుడే చర్చలు మొదలు అయ్యాయి. పవన్ కళ్యాణ్ కోసం కొరటాల ఓ పొలిటికల్ స్క్రిప్ట్ చేసాడని ప్రచారం జరుగుతోండగా, మరో వైపు ఎ.ఎం.రత్నం తో కూడా సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఇది ఇలా ఉంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కోసం ఓ అధ్బుతమైన కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు మరో సారి ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేరోజు ఎంతో దూరంలో లేదనేది తాజా సమాచారం.

అయితే ఈ చిత్రంకు నాగార్జున నటించిన సంతోషం చిత్రంలోని దేవుడే దిగి వచ్చినా పాటలోని మొదటి పదాలను టైటిల్ గా ఫిక్స్ చేయబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పవన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే చాన్స్ ఉంది. ఇక ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై రాథా కృష్ణ నిర్మించనున్నట్లు సమాచారం.

Related

  1. యంగ్ హీరో కోసం వస్తున్న పవర్ స్టార్!
  2. చిరు రెబల్ స్టార్ అయితే.. బన్నీ పవర్ స్టార్!
  3. పవర్ స్టార్ కోసం కొరటాల శివ ఏం చేస్తున్నాడో తెలుసా?
  4. పవర్ స్టార్ కి ధైర్యం చెప్పిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -