Saturday, May 18, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు వీళ్ళే

- Advertisement -

పవ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం డాలీ ద‌ర్శక‌త్వంలో కాట‌మ‌రాయుడు అనే చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం వీరంకు రీమేక్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుండగా క‌థ‌ను బ‌ట్టి హీరోకు ముగ్గురు త‌మ్ముళ్ళు కావ‌ల‌సి ఉంది. అయితే చిత్ర యూనిట్ కొన్నాళ్ళుగా ప‌వ‌న్‌కి త‌మ్ముళ్ళుగా ఎవ‌రిని తీసుకుంటే బెట‌ర‌ని త‌ర్జన భ‌ర్జన ప‌డుతుండగా, ఆయ‌న‌కి త‌మ్ముళ్ళుగా అజ‌య్‌, క‌మ‌ల్ కామ‌రాజు, శివ బాలాజీలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

అజ‌య్ ఇప్పటికే గ‌బ్బర్ సింగ్ చిత్రంలో ప‌వ‌న్ త‌మ్ముడిగా క‌నిపించి మెప్పించాడు. ఇక ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వ‌చ్చే కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

వీలైనంత త్వర‌గా ఈ చిత్ర షూటింగ్ ని పూర్తి చేయాల‌నుకుంటున్న యూనిట్ వ‌చ్చే ఏడాది కాట‌మ‌రాయుడుని థియేట‌ర్లలోకి తీసుకురానున్నట్టు పవ‌న్ స‌న్నిహితుల ద్వారా తెలుస్తోంది.

{youtube}v=fyfQDMrqM8c{/youtube}

Related

  1. ఆ దర్శకుడితో పవన్ సినిమా చేస్తే.. బాహుబ‌లి రికార్డులు ఖాయం!
  2. పవన్ ను బావ అంటున్న మానస హిమవర్ష!
  3. పవన్ ఖర్చు విషయాలు తెలిస్తే.. షాక్ కావాల్సిందే!
  4. చిరు 151 కోసం బోయపాటి ఓకే ? పవన్ కళ్యాణ్ సినిమా మరి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -