Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ లో పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆ సినిమాకి ఏ రెంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఇక ఆ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే. అయితే పవన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన “అత్తారింటికి దారేది” మూడేళ్ల క్రితమే వందకోట్లను మార్కుని దాటి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 131 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసి పవన్ సత్తాను చాటింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో కాట‌మ‌రాయుడు అనే సినిమా చేస్తున్నాడు.  తొలిసారి ఫ్యాక్షనిస్టుగా పవన్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ కి పూర్తి కానుంది. దీని తర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ డైరక్షన్లో సినిమా చేయడం ఖరారు అయింది.

హారిక అండ్ హాసిని బ్యానర్లో  నిర్మాత రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీ కి “దేవుడే దిగివ‌చ్చినా” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని వందకోట్లు ఖర్చు చేసేందుకు నిర్మాత  సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. త్రివిక్రమ్ ఈ సారి కథలో లవ్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. మరి వందకోట్ల తో వస్తున్న ఈ సినిమా బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుందని అభిమానులు అంటున్నారు.

Related

  1. పవన్ కళ్యాణ్ దేవుడు అయ్యాడు!
  2. కొరటాల డైరెక్షన్లో ముఖ్యమంత్రిగా పవన్ సినిమా!
  3. పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు వీళ్ళే
  4. పవన్ ను బావ అంటున్న మానస హిమవర్ష!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -