Thursday, April 25, 2024
- Advertisement -

రవితేజ కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది..!

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది క్రాక్ సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. అదే ఊపుతో ఖిలాడి సినిమా కూడా చేశాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకోగా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఓపెన్ కాగానే ఈ సినిమా విడుదలవుతుంది. కాగా ఈ సినిమా తర్వాత రవితేజ చేయబోయే సినిమా ఇవాళ ప్రారంభమైంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. దివ్యాన్ష కౌషిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. రవితేజ 68వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతుండగా, ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

ఈ పోస్టర్ లో రవితేజ ఓ చైర్ లో కూర్చొని తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయం వైపు చూస్తున్నాడు. దీన్నిబట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని బయట పెట్టే పాత్రలో రవితేజ నటించనున్నట్లు అర్థమవుతోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దివ్యాన్ష కౌషిక్ కు ఇది తెలుగులో రెండో సినిమా. రెండేళ్ల కిందట విడుదలైన నాగచైతన్య మజిలీ సినిమా ద్వారా ఈమె హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ అగ్రహీరో సినిమాలో ఛాన్స్ కోసం ఇన్నాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది.

Also Read

అయ్యో రకుల్ ఏంటీ పరిస్థితి..!

దూసుకుపోతున్న మెగా మేనల్లుడు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -