అయ్యో రకుల్ ఏంటీ పరిస్థితి..!

- Advertisement -

రకుల్​ ప్రీత్​సింగ్​ ఒకప్పుడు టాలీవుడ్​లో టాప్ హీరోయిన్ స్థానాన్ని ఎంజాయ్​ చేసింది. కానీ రాను రాను అవకాశాలు సన్నగిల్లాయి. బాలీవుడ్​లో టాప్​ హీరోలందరితోనూ రకుల్ ఆడిపాడింది. కానీ ఇటీవల అవకాశాలు తగ్గాయి. నాగార్జునతో నటించిన మన్మథుడు -2 అట్టర్​ప్లాప్​ కావడంతో రకుల్​కు అవకాశాలు తగ్గాయి. ఆమెతో చేసేందుకు యువ అగ్ర హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ప్రస్తుతం రష్మిక మందన్న, పూజా హెగ్డేల హవా నడుస్తోంది. దీంతో చిన్న పాత్రలు, హీరోయిన్​ ఓరియెంటెడ్​ రోల్స్​ చేసేందుకు కూడా రకుల్​ సిద్ధపడింది.

కోలీవుడ్, ముంబైలోనూ అవకాశాల కోసం ప్రయత్నించగా అక్కడ కూడా బ్యాడ్​లక్​ ఎదురైంది. దీంతో చిన్న హీరోలతో అయినా సరే చేసేందుకు రకుల్ ముందుకు వస్తుంది. ప్రస్తుతం తెలుగులో విశ్వక్​సేన్​తో రకుల్​ ఓ సినిమాలో చేస్తున్నట్టు టాక్​. ఇప్పటికే ఆ మూవీలో నలుగురు హీరోయిన్స్​ ఉన్నారు. ఇక రకుల్​ కు ఏ క్యారెక్టర్​ ఇస్తారో అని గుసగుసలు నడుస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే.. తమిళ దర్శకుడు ఏ.ఎల్‌ విజ‌య్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘అక్టోబ‌ర్ 31..లేడీస్ నైట్’ పేరుతో ఈ మూవీ వస్తోంది. నివేదా పేతురాజ్‌, రెబా మోనిక జాన్‌, మంజిమ మోహ‌న్‌, మేఘా ఆకాశ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో విశ్వక్​సేన్​ హీరో. అయితే ఇందులో ప్రస్తుతం రకుల్​ను ఎంపిక చేసినట్టు టాక్. ఆమెకు ఏ క్యారెక్టర్​ ఇచ్చారో వేచి చూడాలి. ఇక ఏఎల్​ విజయ్​ తెరకెక్కించిన తలైవి విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిష్ దర్శకత్వంలో యువ మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ సినిమాలో కూడా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. వైష్ణవ్ తేజ్ కు ఇది రెండో సినిమా మాత్రమే. తనకన్నా వయసులో చిన్నవాడైన హీరోతో కూడా రకుల్ నటిస్తోంది. విశ్వక్ షేన్ వయసు కూడా తక్కువే. అవకాశాల్లేక చిన్న హీరోలు, తన కన్నా చిన్న వాళ్లతో కూడా రకుల్ నటిస్తున్నట్లు నడుస్తోంది.

Also Read

ఒక్క సినిమా హిట్ కొట్టు.. నాని సినిమా పట్టు..!

నా బయోపిక్​ తీస్తే అతడే హీరో.. రైనా

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -