Saturday, April 20, 2024
- Advertisement -

మహమ్మారి మబ్బులనూ ఛేదించాయ్..! తొలి ఆరు నెలల్లో నాలుగు బ్లాక్ బస్టర్లు

- Advertisement -

ప్రతి ఏటా టాలీవుడ్ లో సినిమాల విడుదలకు సంబంధించి, మొదటి క్వార్టర్ లో ఎన్ని సినిమాలు విడుదల అయ్యాయి.. ఎన్ని విజయం సాధించాయి.. రెండో క్వార్టర్లో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి.. సక్సెస్ అయింది ఎన్ని.. అని లెక్కలు వేసుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. అయితే ఇప్పుడు ఆ లెక్కలు వేసుకునే అవసరం కూడా లేకుండా పోయింది. అందుక్కారణం కరోనా మహమ్మారే. కరోనా కారణంగా సినిమాల షూటింగ్ నిలిచి పోవడమే కాకుండా, థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఈ ఏడాది తొలి మూడు నెలలు మాత్రమే వరుసగా సినిమాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి థియేటర్లు మూత పడ్డాయి.

అయినా ఈ ఏడాది తొలి ఆరు నెలలు విడుదలైన సినిమాలు తక్కువే అయినా, వాటిలో విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 9న విడుదలైన మొదటి సినిమా క్రాక్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా రవితేజ నటించగా, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక నిరుత్సాహంలో ఉన్న రవితేజకు ఈ సినిమా ఎంతో ఉత్సాహాన్ని నింపింది. సంక్రాంతి సందర్భంగా రామ్ హీరోగా నటించిన రెడ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్, మెయిల్, సైకిల్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. ఒక్క రెడ్ సినిమా మాత్రమే పర్వాలేదనిపించింది.

Also Read: అగ్ర హీరోలూ ఈ సారైనా వెండితెరపై దర్శనమిస్తారా?

ఇక ఇదే నెలలో విడుదలైన సూపర్ ఓవర్, బంగారు బుల్లోడు, జైసేన ఫ్లాపయ్యాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతూ నిర్మించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక ఫిబ్రవరి నెలలో విడుదలైన ఉప్పెన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాగా, బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి ఇండస్ట్రీని నివ్వెరపరిచింది. ఒక డెబ్యూ హీరో నటించిన మరో ఏ సినిమాకు ఇంత స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.

ఈ నెలలోనే విడుదలైన జాంబి రెడ్డి, నాంది సినిమాలు హిట్ గా నిలిచాయి. పిట్టకథలు, పొగరు, సుమంత్ కపటధారి, నితిన్ చెక్ నిరాశపరిచాయి. మార్చి 11న విడుదలైన జాతి రత్నాలు ఈ ఏడాది ప్రథమార్థంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. స్వప్న సినిమా బ్యానర్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ అనుదీప్ దర్శకత్వం వహించాడు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Also Read: ‘మా’ పెట్టిన చిచ్చు.. చిరు వర్సెస్​ మోహన్​బాబు

మార్చిలో విడుదలైన సినిమాల్లో ఏ వన్ ఎక్స్ ప్రెస్, గాలి సంపత్, చావు కబురు చల్లగా, మోసగాళ్లు, అరణ్య, తెల్లవారితే గురువారం సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. నితిన్ హీరోగా నటించిన రంగ్ దే, శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలకు మంచి రివ్యూస్ వచ్చినా హిట్ స్థాయిని అందుకోలేకపోయాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన సమయంలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం, అదనపు షోలు క్యాన్సిల్ చేసినా, ఈ సినిమా థియేటర్లో ఉండగానే కరోనా వ్యాప్తి పెరిగినా వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇన్ని అవాంతరాల మధ్య కూడా ఈ సినిమా దగ్గర దగ్గర వంద కోట్ల షేర్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కు మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచింది. ఇదే నెలలో వచ్చిన నాగార్జున వైల్డ్ డాగ్ డిఫరెంట్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకో ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇక ఈ నెలలో విడుదలైన దెయ్యం, వై సినిమాలు నిరాశపరిచాయి.

Also Read: ‘ఐకాన్’ తో సుకుమార్ కు భలే చిక్కొచ్చి పడిందే..!

ఏప్రిల్ ద్వితీయార్థం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడ్డాయి. అప్పటి నుంచి జూన్ వరకు చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. అయితే అవేమీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ ఒక్కటే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్ మేర్లపాక గాంధీ కథ అందించగా, కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఆరు నెలల్లో విడుదల అయిన సినిమాలు తక్కువే అయినా క్రాక్,ఉప్పెన, వకీల్ సాబ్, జాతి రత్నాలు వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా వకీల్ సాబ్ నిలిచినా జాతి రత్నాలు మాత్రమే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Also Read: స్టార్ మాలో ఇక సందడే సందడి.. వరుసగా అగ్ర హీరోల సినిమాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -