Wednesday, May 1, 2024
- Advertisement -

గుండెల్ని పిండేలా చైతూ సాయిప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీ సాంగ్

- Advertisement -

అక్కినేని నాగ చైత‌న్య అందాల తార సాయిప‌ల్ల‌విలా ల‌వ్ స్టోరీ గుండెల్ని పిండిస్తోంది. వీరిద్ధ‌రి మ‌ధ్య ల‌వ్ స్టోరీ ఎంటీ అనుకుంటున్నారా? సంచ‌ల‌న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రమే ల‌వ్ స్టోరీ. ఇందులో నాగ్ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విలు హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ సినిమా ఓ అంద‌మైన ల‌వ్ స్టోరీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోంది. హైద‌రాబాద్ నేప‌థ్యంలో సాగే ఈ ప్రేమ‌క‌థ‌కు సంబంధించి ఇప్ప‌టికే విదుద‌ల చేసిన ఈ సినిమా టీజ‌ర్లు తెగ అక‌ట్టుకుంటున్నాయి. సంచ‌నాలు సృష్టిస్తూ అంద‌మైన ప్రేమ కావ్యాల‌ను వెండితెర‌పై చూపించ‌డంలో శేఖ‌ర్ క‌మ్ముల‌ది అందేవేసిన చేయి. అందుకే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ల‌వ్ స్టోరీ చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న విడుద‌ల చేయ‌నున్నామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇప్ప‌టికే ప్ర‌కటించారు. తాజాగా ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ల‌వ్ స్టోరీలోని ఓ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ వీడియో సాంగ్ చూసిన నెటిజ‌న్లు ఆసక్తిక‌ర‌మైన కామెంట్లు చేస్తున్నారు. గుండెల్ని పిండేలా.. అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నామ‌ని పేర్కొంటున్నారు.

అఖిల్‌కు పూజా హెగ్దే విసిరిన గులాబి బాణం చూశారా?

ప్రేమికుల రోజు కథేంటో తెలుసా? ఫిబ్ర‌వ‌రి 14 నే ఎందుకు ?

అలాంటి పెళ్లికి ఎవ‌రి అంగీకార‌మూ అక్కర్లేదు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -