Friday, March 29, 2024
- Advertisement -

అలాంటి పెళ్లికి ఎవ‌రి అంగీకార‌మూ అక్కర్లేదు !

- Advertisement -

మ‌న స‌మాజంలో కాలంతో పాటు అనేక విప్ల‌వాత్మ‌క మార్పులు సైతం వ‌చ్చాయి. అయితే కులాలు, మ‌తాలు, వివాహాల‌కు సంబంధించి కొన్ని క‌ట్టుబాట్లు అలాగే ఉండిపోయాయి. వీటి వ‌ల్ల ఇప్ప‌టికీ మ‌నుషుల మ‌ధ్య అనేక అంత‌రాలు నెల‌కొన్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఓ కేసు సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. వేలాది సంత్స‌రాలుగా స‌మాజంలో న‌డుస్తున్న ప్ర‌జ‌ల మ‌ధ్య నెల‌కొన్న అంత‌రాలు, స‌మాజిక క‌ట్టుబాట్లు తొల‌గిపోవాలంటే కులాంత‌ర వివాహాలు, మ‌తాంత‌ర వివాహాలు మేల‌ని న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది.

సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు సంజ‌య్ కౌల్‌, హృషికేశ్ రాయ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం.. ఇద్ద‌రు మేజ‌ర్లు ప్రేమ పెళ్లి చేసుకోవ‌డానికి వారి త‌ల్లిదండ్రుల‌తో పాటు కుల పెద్ద‌ల‌తో పాటు ఎవ‌రి అంగీకారం అవ‌స‌రం లేదంటూ సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించారు. ఇటీవ‌ల క‌ర్నాట‌కు చెందిన ఇద్ద‌రు మేజ‌ర్లు త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌కుండా పెళ్లి చేసుకున్నారు. అయితే, అమ్మాయి కుటుంబం.. త‌న కూతురును కిడ్నాప్ చేశాడ‌ని అబ్బాయిపై కేసు ప‌ట్టింది. ఆ జంట పెళ్లి చేసుకున్నార‌ని తెలిసి కూడా కేసు వెన‌క్కి తీసుకోలేదు.

ఈ నేప‌థ్యంలోనే పోలీసుల ఒత్తిడి, అమ్మాయి కుటుంబం బెదిరింపుల‌తో ఆ జంట సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిని విచారించిన క్ర‌మంలో అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పందిస్తూ.. ఇద్ద‌రు చదువుకున్న మేజ‌ర్లు.. ఒక‌రికి ఒక‌రు న‌చ్చ‌డంతో కులమ‌తాల‌క‌తీతంగా పెళ్లి చేసుకున్నార‌నీ, దీనిని వారి త‌ల్లిదండ్రులు అర్థం చేసుకోవాల‌ని తెలిపింది. ఇలాంటి పెళ్లిళ్ల‌తో స‌మాజంలో అంత‌రాలు త‌గ్గిపోతాయ‌ని పేర్కొంది. ఇలాంటి వివాహాల‌కు ధ‌ర్మాస‌నం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

నారింజ పండ్ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా?

ప్రేమికుల రోజు కథేంటో తెలుసా? ఫిబ్ర‌వ‌రి 14 నే ఎందుకు ?

‘ధూమ్’ సీక్వెల్ లో దుమ్ములేప‌నున్నదీపిక !

ప్రభావవంతమైన భారతీయుల్లో టాప్ లేపిన అల్లు అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -