మొటిమలు పొగుట్టుకొనేందుకు ఏం చేస్తానంటే? తమన్నా టిప్​..!

- Advertisement -

మొహం మీద మొటిమలు ఏర్పడటం చాలా మందికి ఓ సమస్య. ముఖ్యంగా అమ్మాయిలు ఈ ప్రాబ్లమ్​ను ఎక్కువగా ఫేస్​ చేస్తారు. టీనేజ్​ పిల్లల దగ్గరనుంచి 30 ఏళ్ల లోపు వాళ్లకు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇందుకోసం అనేక చికిత్సలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎంత అందమైన మొహం అయినా.. మొటిమలు ఉంటే అందవికారంగా మారుతుంది. అయితే ప్రముఖ నటి తమన్నాకు కూడా మొటిమల సమస్య ఉందట. దీంతో మొటిమలు ఎలా పొగొట్టుకోవాలో తమన్నా ఓ టిప్​ చెప్పింది.

అయితే తమన్నా చెప్పే టిప్​ కాస్త చిత్రంగా అనిపించింది. దీంతో చాలా మంది తమన్నా ఏంటి? ఇలా చెప్పింది అని కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. ‘నాకు చాలా మందిలాగే మొటిమల సమస్య ఉంది. ఇందుకోసం నేను మార్నింగ్​ సెలైవాను వాడతాను. ఉదయాన్నే మొటిమలు ఉన్నచోట ఉమ్మిని రుద్దుకుంటే మొటిమల సమస్య పోతుంది. నా స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సెలైవాను కూడా యూజ్‌ చేస్తా. సెలైవాలో పింపుల్స్‌ను పొగొట్టే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ క్వాలిటీస్‌ ఉన్నాయి. ఇది సైంటిఫిక్​గా కూడా నిరూపించబడింది’ అని చెప్పుకొచ్చింది తమన్నా.

- Advertisement -

అయితే ఇది నిజంగానే శాస్త్రీయమేనా? లేక ఆయుర్వేద విధానంలో ఉందా? అనే విషయం నిపుణులు చెప్పాలి. తమన్నా మాత్రం మొటిమలు పొగుట్టుకొనేందుకు తాను ఏం చేస్తానో చెప్పుకొచ్చింది. తమన్నా నటించిన సీటీమార్​ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక నితిన్​ హీరోగా చేస్తున్నమాస్ట్రో సినిమాలోనూ ఓ కీ రోల్​ చేస్తోంది. ఇవి కాక పలు తమిళ, కన్నడ చిత్రాలు, వెబ్​ సీరిస్​ల్లోనూ తమన్నా నటిస్తోంది.

Also Read

జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి

మీ దంతాలు పసుపురంగులో ఉంటే.. ఈ చిట్కాలు మీ కోసం !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -