Friday, April 26, 2024
- Advertisement -

బాలీవుడ్ బడా స్టార్ రెండో భార్యకూ విడాకులు ఇచ్చాడు..!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్ ఒకడు. సినిమాల్లో ఆయన నటనకు గాను అందరూ ఆయన్ను మిస్టర్ పర్ఫెక్ట్ అంటుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం అమీర్ ఖాన్ కు కలసి రావడం లేదు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిరణ్ రావు ను పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్.. తాజాగా ఆమె నుంచి విడిపోయారు. ఆయన తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే అమీర్ ఖాన్ ఆయన భార్య కిరణ్ రావ్ విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకులు తీసుకున్నట్లు ఇద్దరు కలిసి సంయుక్తంగా ప్రకటించడం విశేషం.

1986లో విడుదలైన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో నటించిన రీనా దత్తను అమీర్ ఖాన్ మొదటి వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు జునైద్, కుమార్తె ఇరా ఉన్నారు. ఆ తర్వాత రీనా, అమీర్ ఖాన్ 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు అశుతోష్ గోవరికర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా నటిస్తున్న కిరణ్ రావును అమీర్ ఖాన్ వివాహం చేసుకున్నాడు.

Also Read: ఈ సారైనా అగ్ర హీరోలూ వెండితెరపై దర్శనమిస్తారా?

15 ఏళ్ల పాటు వివాహ బంధంలో ఉన్న వీరిద్దరూ తాజాగా విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. జీవితంలో కొత్త అంకానికి నాంది పలకడం కోసమే తాము విడిపోతున్నట్లు వారు ప్రకటించారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తమ కుమారుడు ఆజాద్ ను కలసి చూసుకుంటామని చెప్పారు. అలాగే తాము నిర్వహిస్తున్న పానీ ఫౌండేషన్ ను ఇద్దరం సంయుక్తంగా నిర్వహిస్తామని కిరణ్ రావు, అమీర్ ఖాన్ ప్రకటించారు.

Also Read: బిగ్​బాస్​ సీజన్​ -5 హోస్ట్​ ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -