Friday, March 29, 2024
- Advertisement -

పాపం.. ఆ నటుడుకి డైరెక్టర్ వంశి జీవితంపై విరక్తి కలిగించాడట!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు,క్యారెక్టర్ ఆర్టిస్ట్ ,దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న
చిన్నా అస‌లు పేరు జితేంద‌ర్ రెడ్డి. ఆయన మొదట రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ “శివ ” సినిమాలో నాగార్జున స్నేహితుడిగా చిన్నా పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిన్నా పేరుతోనే ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు.

అలాగే చిన్నా “ఆ ఇంట్లో” అనే హారర్ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మారాడు.
ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటించి ప్రశంసలు పొందాడు.ప్రస్తుతం చిన్నా బుల్లితెరపై ప్రముఖ సీరియల్స్ లో నటిస్తున్నాడు. తాజాగా నటుడు చిన్నా ఓ సందర్భంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.చిన్నాహైద‌రాబాద్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో న‌ట‌న‌లో శిక్ష‌ణ పొందాక అవకాశాల కోసం మ‌ద్రాస్ నగరంవెళ్లాడట.అలా ఓరోజు మ‌హ‌ర్షి సినిమా కోసం వంశీ గారు కొత్త‌వాళ్ల‌ను సెల‌క్ట్ చేస్తున్నాడ‌ని తెలుసుకొని అక్కడికి వెళితే స‌రిగ్గా అప్పుడే ఆఫీసులోంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు వంశీ గారు.సార్‌ న‌మ‌స్తే నేను ఆర్టిస్టునండీ అని పరిచయం చేసుకోబోయాడు. అంతలో వంశీ ఇప్పుడేం లేవు పో పో..అని చేయి విదిలించారు.ఏం చేయాలో అర్థంకాక దిగులుగా నిల్చుండిపోయాను.

Also read:డిన్నర్ రన్ అంటూ చీరకట్టులో పరిగెత్తుతున్న తాప్సి!

ఆ సమయంలో అక్క‌డ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు చూసుకుంటున్న వేమూరి స‌త్యనారాయ‌ణ నన్ను గ‌మ‌నించి బాబూ ఇలారా.. అని పిలిచి నా ద‌గ్గ‌ర ఫొటోలు తీసుకొని,అడ్ర‌స్ రాసుకొని ఏదైనా అవ‌కాశం ఉంటే పిలుస్తా అని చెప్పి పంపించారు. అయిన నటన మీద ఉన్న ఆసక్తితో ఎంత కష్టమైనా భరించి అవకాశాలు దక్కించుకొని ఈ స్థాయిలో ఉన్నాను అంటూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నటుడు చిన్నా.

Also read:అందుడిగా అల్లు అర్జున్… ఆ సినిమా కోసం అంత సిద్ధం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -