Thursday, May 2, 2024
- Advertisement -

గుమగుమలాడే గుత్తి వంకాయ్ కూర.. ఇలా చేస్తే లొట్టలెయ్యాల్సిందే!

- Advertisement -

తెలుగు వంటకాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటలలో గుత్తివంకాయ ఒకటి. ఏదైనా పండుగలు ప్రత్యేక శుభ కార్యాలు ఉన్నాయ్ అంటే అందులో తప్పకుండా గుత్తి వంకాయ కూర ఉండాల్సిందే. మరి గుమగుమలాడే నోరూరించే ఈ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
చిన్న సైజు వంకాయలు అరకిలో, వేరు శనగ పల్లీలు 1 కప్పు, నువ్వులు టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 10, ధనియాల పొడి టేబుల్ స్పూన్, కొత్తిమీర గుప్పెడు, లవంగాలు 4, ఉప్పు తగినంత, కారం పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. నూనె తగినంత, కరివేపాకు రెమ్మ, ఆవాలు, జీలకర్ర టేబుల్ స్పూన్.

తయారీ విధానం:
*ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వేరుశెనగ పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఆ తరువాత అదే కడాయిలోకి టేబుల్ స్పూన్ నువ్వులు వేసి చిటపట అని వరకు వేయించుకోవాలి.
*వేరుశనగ పల్లీలు, నువ్వులు చల్లబడిన తరువాత వాటిని ఒక మిక్సీ గిన్నెలో వేసి, వాటితో పాటు కొబ్బరిపొడి, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

*ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి టేబుల్ స్పూన్ కారం వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి.

*తరువాత ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి వంకాయలను నాలుగు భాగాలుగా పూర్తి కట్ చేయకుండా కొంతవరకు కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి.

*ఈ విధంగా వంకాయలు అన్నింటినీ కట్ చేసుకుని తరువాత ఒక్కొక్కటిగా తీసుకొని అందులోకి ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పెట్టాలి.

*ఇలా వంకాయలన్ని మిశ్రమంతో నింపిన తర్వాత స్టవ్ మీద కడాయి ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెమ్మ పోపు పెట్టాలి.

Also read:ఒకప్పటి ఫోటో షేర్ చేసిన వర్మ..?

*తరువాత మనం తయారు చేసుకున్న మిశ్రమం మిగిలి ఉంటే దానిని పోపులో వేసి చిన్న మంటపై బాగా కలియబెట్టాలి.

*ఈ మసాలా మిశ్రమంలోకి చిటికెడు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మసాలా మగ్గిన తర్వాత మనకు కావలసిన నీరును వేసుకోవాలి.

*ఈ నీళ్లు బాగా ఉడుకుతున్న తరువాత ముందుగా మసాలా మిశ్రమాన్ని పెట్టుకున్న వంకాయలను అందులో వేయాలి.

Also read:అందుడిగా అల్లు అర్జున్… ఆ సినిమా కోసం అంత సిద్ధం!

*వంకాయలు అన్ని వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి వంకాయ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర తయారైనట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -