Friday, March 29, 2024
- Advertisement -

డిన్నర్ రన్ అంటూ చీరకట్టులో పరిగెత్తుతున్న తాప్సి!

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ తాప్సీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా హాలిడే వెకేషన్ కి వెళుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే గతేడాది మాల్దీవులకు వెళ్లిన ఈ బ్యూటీ తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేశారు. ఇక తాజాగా రష్యా టూర్ వెళ్లిన ఈ భామ అక్కడ వివిధ నగరాలలో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో ఓ డిన్న‌ర్‌కు అటెండ్ అయినా తాప్సి డిన్నర్ కోసం ఎంతో స్పెషల్ గా చీర కట్టుకొని వెళ్లారు. బ్లూ కలర్ బ్లౌజ్ వైట్ సమ్మర్ చీర ధరించి, చేతికి గాజులు సన్ గ్లాసెస్ తో ఎంతో హడావిడి గా రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:శేఖర్ కమ్ములతో సినిమాపై స్పందించిన ధనుష్!

రష్యా రాజధానిలో దిగిన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం రష్యా పర్యటన వెళ్ళిన ఈ భామ అక్కడ తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ఈమె నటించిన “హ‌సీనా దిల్‌రుబా”చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.లూప్ ల‌పేటా, ర‌శ్మీ రాకెట్‌, శాభాష్ మిట్టు వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also read:మహేశ్‌, ప్రభాస్‌ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన సుబ్బరాజు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -