Saturday, April 20, 2024
- Advertisement -

ట్విట్టర్​లో సౌత్ లోనే నంబర్​ 1 ప్లేస్ కి స్టార్ హీరో..!

- Advertisement -

రజనీకాంత్​ అల్లుడిగా మాత్రమే కాక.. ప్రముఖ నటుడు, రచయిత, సింగర్​గా కూడా ధనుష్​ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. తమిళనటుడైన ధనుష్​.. బాలీవుడ్​, హాలీవుడ్​ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ధనుష్​ మల్టీ ట్యాలెంటెడ్​ హీరో అన్న విషయం తెలిసిందే. కేవలం మాస్​ సినిమాలు మాత్రమే కాకుండా.. కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగాడు. శేఖర్​ కమ్ముల డైరెక్షన్​లో ధనుష్​ ఓ సినిమా చేయబోతున్నాడు.
ఈ చిత్రం పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్నది.

ధనుష్​ తాజాగా ఓ అరుదైన ఘనత సాధించాడు. ట్విట్టర్​లో 10 మిలియన్​ ఫాలోవర్లను సాధించాడు. రజనీకాంత్​, విజయ్​, కమల్​ హాసన్​, సూర్య వంటి అగ్రహీరోలకు సైతం ఈ రేంజ్​లో ఫాలోయింగ్​ లేదు. దీంతో ధనుష్​ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ట్విట్టర్‌లో 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ సంపాదించిన తొలి తమిళ నటుడుగా ధనుష్ రికార్డులకు ఎక్కాడు.ట్విట్టర్‌లో #10MillionFollowersForDhanush అనే అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు ధనుష్​ ఫ్యాన్స్​.

Also Read: బండ్ల గణేశ్​.. పవర్​స్టార్​ మూవీ టైటిల్​ ఇదేనా? ఫ్యాన్స్​ డిమాండ్​

ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించబోయే తన 43వ చిత్రంలో ధనుష్ నటిస్తున్నాడు. హిందీలో అక్షయ్ కుమార్ తో కలిసి ‘అట్రాంగి రే’ లో నటన పూర్తి చేసాడు. మొత్తానికి ధనుష్​ ఈ ఘనత సాధించడం నిజంగా గర్వ కారణమే. కోలీవుడ్ తో పాటు బాలీవుడ్​, హాలీవుడ్​, టాలీవుడ్​లో ధనుష్​కు ఫ్యాన్స్​ ఉండటంతో ఈ ఘనత సాధ్యమైందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రాధే శ్యామ్ తాజా అప్డేట్ ఏమిటంటే ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -