Friday, April 26, 2024
- Advertisement -

మరోసారి రాపో డబుల్​ రోల్​.. వర్కవుట్ అవుతుందా?

- Advertisement -

తమిళ దర్శకుడు, మాస్​ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా సినిమాలు తెరకెక్కించే లింగుస్వామి దర్శకత్వంలో రామ్​ పోతినేని నటిస్తున్న విషయం తెలిసిందే. లింగుస్వామి డైరెక్షన్​ అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో పందెం కోడి, రన్, ఆవారా వంటి మాస్​ చిత్రాలను తెరకెక్కించాడు లింగుస్వామి. లింగుస్వామి చిత్రాల్లో హీరోలు ఊరమాస్​లా కనిపిస్తుంటారు. ఇక యాక్షన్​ సన్నివేశాలకు కొదవే ఉండదు. ఎంతో సహజంగా మాస్​ సన్నివేశాలను తెరకెక్కించడం.. పల్లెటూరు వాతావరణాన్ని ఎంతో సహజంగా కళ్లకు కట్టినట్టు చూపించడం లింగుస్వామి ప్రత్యేకత.

గతంలో కేవలం లవర్​ బాయ్​గా తరహా పాత్రలను మాత్రమే రామ్​ ఒప్పుకొనేవాడు. కానీ ఇస్మార్ట్​ శంకర్​లో మాస్​ లుక్స్​తో అదరగొట్టాడు. ఈ చిత్రం సూపర్​ సక్సెస్​ అయింది. దీంతో లింగుస్వామి డైరెక్షన్​లో ఓ చిత్రంలో చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకు ‘ఉస్తాద్’ టైటిల్​ను ఖరారు చేశారట. అంతేకాక ఈ చిత్రంలోరామ్​ డ్యూయల్​ రోల్​ చేయబోతున్నట్టు సమాచారం.

Also Read: అన్నా మీ నంబర్​ ఇవ్వండి.. తేజ్​ ఫన్నీ ఆన్సర్​..!

పవర్​ఫుల్ పోలీస్​ ఆఫీసర్​, డాక్టర్​గా కనిపించబోతున్నాడట. అయితే పోలీస్​ పాత్ర ఎంతో సహజంగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్​ ప్రారంభమయింది. ఈ సినిమాపై రామ్​ ఫ్యాన్స్​ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇస్మార్ట్​ శంకర్​ తర్వాత రామ్​ నటించిన రెడ్​ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్​. ​

Also Read: ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -