ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రాధే శ్యామ్ తాజా అప్డేట్ ఏమిటంటే ..!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. పూజా హెగ్డే పై పెండింగ్ ఉన్న కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ప్రభాస్ పూజ హెగ్డే లపై ఓ పాట చిత్రీకరించాల్సి ఉంది.

ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సినిమా విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించనున్నారు. కాగా తాజా అప్డేట్ ప్రకారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రభాస్, పూజ హెగ్డే పై పాట చిత్రీకరించనున్నట్లు సమాచారం. కాగా మిర్చి సినిమా తర్వాత ఏడేళ్ళ కాలంలో ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు బాహుబలి, బాహుబలి 2, సాహో మాత్రమే.

- Advertisement -

Also Read: నభా నటేష్ ను మాస్ట్రో ఒడ్డున పడేస్తుందా..!

దీంతో ప్రభాస్ నటించిన సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇకపై ప్రభాస్ నటించిన సినిమాలు వరుసగా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. అతి త్వరలోనే రాధే శ్యామ్ విడుదల కానుండగా, సలార్, ఆది పురుష్ సినిమాలను ప్రభాస్ సమాంతరంగా చేస్తుండడంతో ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: రామ్ తో ఢీ అంటే ఢీ అంటున్న ఆది పినిశెట్టి..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -