Friday, March 29, 2024
- Advertisement -

నాని వర్సెస్​ సత్యదేవ్​.. థియేటర్​ వార్​

- Advertisement -

కరోనా ఎఫెక్ట్​తో థియేటర్లలో సినిమాలు చూసే భాగ్యమే లేకుండా పోయింది. కరోనా ఫస్ట్​వేవ్​ లాక్​డౌన్​తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఇక థియేటర్ల పనిఅయిపోయినట్టేనని.. ఓటీటీ యుగంలో థియేటర్లకు భవిష్యత్​ ఉండదని వార్తలు వినిపించాయి. కానీ లాక్​డౌన్​ ఎత్తేశాక.. విడుదలైన సోలో బ్రతుకే సో బెటరు, క్రాక్​, ఉప్పెన, వకీల్ సాబ్​ వంటి సినిమాలు థియేటర్లలో విడుదలయి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. థియేటర్లకు ఇంకా భవిష్యత్​ ఉందని నిరూపించాయి.

ఇదిలా ఉంటే వకీల్​సాబ్​ థియేటర్లలో ఉండగానే.. కరోనా సెకండ్​వేవ్​ ముంచుకొచ్చింది. దీంతో థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. మొదటి వేవ్​తోనే కుదేలైన థియేటర్ల యజమానులు.. రెండో వేవ్​తో పూర్తిగా నష్టపోయారు. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్​ చేసుకొనేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా.. తెరిచేందుకు యజమానులు జంకుతున్నారు. త్వరలోనే థియేటర్లు ఓపెన్​ అయ్యే చాన్స్​ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది. జూలై 30న నాని నటించిన టక్​ జగదీశ్​, సత్యదేవ్​ నటించిన తిమ్మరసు విడుదల కాబోతున్నాయి.

Also Read: శంకర్​ సినిమాలో చెర్రీ డ్యుయల్​ రోల్​ ?

రెండు చిన్న సినిమాలే కావడంతో.. కలెక్షన్లు ఏ మేరకు ఉంటాయో అన్న ఆసక్తి మొదలైంది. మరోవైపు కరోనా థర్డ్​వేవ్​ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిర్మాతల్లో గుబులు మొదలైంది. గత ఏడాది కరోనా అనంతరం విడుదలైన క్రాక్​, సోలో బతుకే సో బెటర్​ లాగే తమ సినిమాలు కూడా సక్సెస్​ అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఒకేరోజు కాకుండా కొంచెం గ్యాప్​ ఇచ్చి విడుదల చేసుకొంటే ఇద్దరికీ లాభం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రాలు ఏ మేరకు కలెక్షన్లు రాబడతాయో వేచి చూడాలి. కరోనాను లెక్కచేయకుండా ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తితే .. మరిన్ని పెద్ద సినిమాలు కూడా విడుదలయ్యే చాన్స్ ఉంది.

Also Read: బజరంగీ బాయ్​జాన్​ 2 వచ్చేస్తోందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -