Wednesday, May 15, 2024
- Advertisement -

నాకు సీఎం కావాలని ఉందంటున్న సీనియర్ నటుడు..?

- Advertisement -

దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కన్నడ సినీ నటుడు ఉపేంద్ర కు విచిత్రమైన కోరిక కలిగింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఉపేంద్ర తనకు సీఎం కావాలని ఉందంటూ ఆయన ప్రజలకు ఒక లేఖ రాసి ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నటన పరంగా ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఉపేంద్ర ట్విట్టర్ ద్వారా..”నాకు సీఎం కావాలని ఉంది, ఎన్నికలలో పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా” అంటూ ప్రజలకు లేఖ రాశారు.తాను రాజకీయాలలోకి వస్తే నిరంతరం ప్రజల సేవలోనే నిమగ్నమవుతానని సీఎం(కామన్ మ్యాన్) అనే పదానికి సరైన అర్థాన్ని తెలియజేస్తానని తెలిపారు.

Also read:న్యూడ్ క్లిప్స్ లీక్.. తలెత్తుకోలేని పరిస్థితి అంటూ రాధికా ఆప్టే ఎమోషనల్?

తాను సీఎం అయితే ప్రభుత్వం తరఫున ఖర్చు చేసే ప్రతి పైసాకు సమాధానం చెబుతూ జవాబుదారితనంగా, ప్రజల నిర్ణయమే తన నిర్ణయంగా ఉంటానని ఉపేంద్ర ఆ లేఖలో పేర్కొన్నారు. ఉన్న పళంగా ఈ నటుడికి ఈ విధమైన కోరిక కలగడంతో అభిమానులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉపేంద్ర రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే నటుడు ఉపేంద్ర తెలుగులో వరుణ్ తేజ్ నటిస్తున్నటువంటి ‘గని’ చిత్రంలో ఉపేంద్ర వరుణ్ తేజ్ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Also read:సంక్రాంతికి రిలీజ్ అయ్యేది రెండు సినిమాలే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -