Saturday, May 3, 2025
- Advertisement -

రాజమౌళి పిలిచి మరి చాన్స్ ఇస్తే.. తిరస్కరించిన స్టార్స్ వీళ్ళే..

- Advertisement -
Actors Who rejected rajamouli

రాజమౌళి.. ఇప్పటి వరకు ఈ దర్శకుడు ప్లాప్ ను చూడలేదు. చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఈయన డైరెక్షన్ లో నటించాలని చాలామంది ఎదురు చూస్తారు. చిన్న పాత్ర అయిన చేయాలని ఆశపడతారు. అదే రాజమౌళి రేంజ్.. అయితే రాజమౌళినే స్వయంగా పిలిచి మరి అవకాశం ఇస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి.. మరి రాజమౌళి పిలిచి మరి అవకాశం ఇచ్చిన.. ఆ అవకాశం వదులుకున్న స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

* తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి సినిమాలో శివగామి పాత్ర కోసం ముందుగా అందాల నటి శ్రీదేవిని అడిగాడట రాజమౌళి. కానీ ఆ పాత్ర విన్న తర్వాత.. ప్రభాస్ కు తల్లిగా తాను సరిపోను అని ఆ పాత్రను వదిలేసుకుంది. ఆ తర్వాత అదే పాత్ర మంచు లక్ష్మి వద్దకు కూడా వెళ్లింది. ఆమె కూడా ఆ పాత్ర చేయను అని చెప్పడంతో చివరికి శివగామి పాత్ర రమ్య కృష్ణ వద్దకు వెళ్లింది.

* ఇక బాహుబలి సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ముందుగా రాజమౌళి… కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని అనుకున్నాడట. అయితే ఆ సినిమా మొదలు పెట్టే సమయాన్నికి సూర్య రెండు, మూడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. దాంతో బాహుబలి సినిమాలో నటించే అవకాశం సూర్య కోల్పోయాడు.

* బాహుబలి సినిమాలో బాహుబలి పాత్ర ఎంత ప్రధానమో.. భల్లాల దేవ పాత్ర కూడా అంతే కీలకం. అయితే భల్లాల దేవ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ని అడిగారు. యితే అతను ఇతర ప్రాజక్ట్ ల్లో బిజీగా ఉండడంతో అఫర్ ని తిరస్కరించారు.

{loadmodule mod_custom,Side Ad 1}

* స్టూడెంట్ వన్ మూవీ తర్వాత సింహాద్రి కథను మొదట ప్రభాస్ కి వినిపించారంట. అయితే ఆ కథను హ్యాండిల్ చేయలేడేమోనని ప్రభాస్ రిజక్ట్ చేశారు. అదే కథను తెర మీద చూసుకొని రాజమౌళి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

* మగధీర సినిమాలో శ్రీహరి పోషించిన సల్మాన్ పాత్రకు భార్య గా సలోని నటించింది. అయితే నిడివి ఎక్కువ కావడం వల్ల ఆమె నటించిన సీన్స్ తొలిగించారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఆ క్యారక్టర్ కి మొదట అర్చనని అడిగారు. కానీ చిన్న రోల్ అని ఒప్పుకోలేదు.

* బాహుబలి మూవీలో తమన్నా పోషించిన అవంతిక పాత్రకు మొదట.. బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ని తీసుకుందామని అడిగారట. అయితే ఆ ఆఫర్ ని ఆమె వదులుకుందట. ఆ తర్వాత ఆ పాత్ర తమన్నా వద్దకు వచ్చిందట.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి.. రాజమౌళి దర్శకత్వం పక్కా..?
  2. బాహుబలి 2 పై పవన్‌ షాకింగ్ కామెంట్స్.. అనందంలో రాజమౌళి
  3. “భల్లాలదేవ భార్య ఎవరు?” రాజమౌళి క్లారిటీ ఇదే
  4. బాహుబలి 2లో ఆ సీన్ రాజమౌళి కాపీ కొట్టాడా..?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -