Monday, April 29, 2024
- Advertisement -

బాహుబలి 2 పై పవన్‌ షాకింగ్ కామెంట్స్.. అనందంలో రాజమౌళి

- Advertisement -
pawan kalyan reaction on bahubali 2 movie

దేశ వ్యాప్తంగా బాహుబలి 2’ సినిమాపై సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించక పోవడంతో సోషల్‌ మీడియాలో ఓ రెంజ్ లో విమర్శలు పెరిగాయి.

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ‘బాహుబలి 2’ సినిమా పవన్‌ కళ్యాణ్‌కు నచ్చలేదా, లేక సమయం లేక పవన్‌ ‘బాహుబలి 2’ సినిమాపై స్పందించడం లేదా అంటూ అందరూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ బాహుబలిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా వెయ్యి కోట్లు సాధించిన క్రమంలో పవన్‌ స్పందిస్తూ రాజమౌళిపై అభినందనలు గుప్పించాడు.

కృషి, పట్టుదలతో రాజమౌళి అండ్‌ టీం ఒక అద్బుతమైన చిత్రాన్ని తెరకెక్కించి ఇంత పెద్ద విజయాన్ని తెలుగు వారికి అందించి గర్వించేలా చేశారు అంటూ పవన్‌ పేర్కొన్నాడు. ఇలాంటి విజయాలు రాజమౌళికి మరిన్ని దక్కాలని ఆశిస్తున్నట్లుగా పవన్‌ చెప్పుకొచ్చాడు. కేవలం 10 రోజుల్లో వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన ‘బాహుబలి 2’ ఇండియన్‌ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. తెలుగు వారు అంతా గర్వించేలా చేసిన ‘బాహుబలి 2’ సినిమా ఇంకా భారీ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

{yotube}cxtl-WjN-4o{/youtube}

Related

  1. ‘బాహుబలి’లో ఎవరు ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?
  2. సమంత బాహుబలి-2 కి వెళ్లి.. మధ్యలోనే ఎందుకు బయటకు వచ్చిందొ తెలుసా..?
  3. బాహుబలి కి షాక్ ఇచ్చిన ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్
  4. బాహుబలికి కుల గజ్జి అంటించిన..మోహన్ బాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -