Monday, April 29, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి.. రాజమౌళి దర్శకత్వం పక్కా..?

- Advertisement -
Vijayendra Prasad Wants to Work with Pawan kalyan

పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు అభిమానుల గుండేల్లో అనందం మొదలు అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా హిట్ అయిన.. ప్లాప్ అయిన ఆ క్రేజ్ మాత్రం అలానే ఉంటుంది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పవన్ కు బాహుబలికి కథ అందించిన విజయేంద్రప్రసాద్ వ్రాస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆ ప్రభంజనం ఎంత వరుకు చేరుతుందో ఊహించుకోండి. విజయేంద్రప్రసాద్ రాజమౌళి సినిమాలకే కాకుండా బాలీవుడ్ భజరంగీ భాయ్జాన్ అనే సినిమాకి కూడా కథ అందించాడు. భజరంగీ భాయ్జాన్ ఏ రెంజ్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి2 ఘనవిజయంతో విజయేంద్రప్రసాద్ దేశంలో గొప్ప రచయతగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మణికర్ణిక – ఝాన్సీలక్ష్మీబాయ్ జీవిత కథ సినిమాకి రచయితగా పనిచేసే చాన్స్ దక్కించుకున్నారు. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహుస్తుండగా.. కంగనా ఝాన్సీలక్ష్మీబాయ్ గా నటిస్తున్నారు. ఇక పవన్ గురించి విజయేంద్ర ప్రసాద్ ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాహుబలి 2 ఇంటెర్వెల్ సీన్ ను పవన్ ఫ్యాన్స్ ను తలుచుకొని రాసుకొన్నా అని చెప్పాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

పవన్ నిజాయతీని వ్యక్తిత్వాన్నీ తెగ మెచ్చుకున్నారు. నిజ జీవితంలో పవన్ ఒక బాహుబలి లాంటివాడు అని అన్నారు. మరి అలాంటి పవన్ ని విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తే ఎలా ఉంటుంది..? ఇదే విషయంపై అతన్ని అడిగితే.. పవన్ కోసం కథ తప్పకుండా రాస్తా నాకు  పవన్ తో కలసి పనిచేయాలిని ఉంది అన్నారు. 1000 కోట్ల విలువైన సినిమాని  అందించిన విజయేంద్రప్రసాద్ పవన్ కోసం కథ రాయడానికి ఎదురుచూడం ఫ్యాన్స్ ను సంతోషపెట్టే విషయమే. కానీ అతని కథకు సరిపడే దర్శకుడు ఒక్క రాజమౌళినే. మరి పవన్ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ మాటలు రాస్తే.. రాజమౌళి దర్శకత్వం చేస్తే.. ఆ సినిమా మన ఊహకు కూడా అందని రెంజ్ లో ఉంటుంది. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}OStl8FxNnF0{/youtube}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -