Monday, April 29, 2024
- Advertisement -

బాహుబలి 2లో ఆ సీన్ రాజమౌళి కాపీ కొట్టాడా..?

- Advertisement -
Copy Scenes in Baahubali 2 Movie

మామూలుగా ”ది 300” ”ట్రాయ్” ”అలగ్జాండర్” వంటి చిత్రాలను చూసి.. ”బాహుబలి” కోసం రాజమౌళి అనేక సీన్లను డిజైన్ చేశాడని ఎవరైనా కూడా ఇట్టే చెప్పేస్తారు. అయితే ఎప్పుడూ వీటినుండే దించితే.. మిగలిన టివి సీరీస్ లు ఏమైపోతాయ్? అంటూ సోషల్ మీడియా జనాలు ప్రశ్నిస్తున్నారు.

ఆల్రెడీఎ ”గేమ్ ఆఫ్ థ్రోన్స్” సీరియల్ నుండి చాలా ఐడియాలను తీసుకున్న రాజమౌళి అండ్ టీమ్.. మరో టివి సిరీస్ లోని సీన్లను కూడా దించేశారని వీరు అంటున్నారు. అమెరికన్ టెలివిజన్ లో ”మార్కోపోలో” అంటూ ఒక 10 ఎపిసోడ్ల సిరీస్ వచ్చేది. రెండు సంవత్సరాల్లో రెండు సీజన్లను ప్రసారం చేశాక.. ఈ సిరీస్ తో భారీ లాస్ వచ్చిందని.. అందుకని దీన్ని ఆపేస్తున్నాం అని పేర్కొంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ. అయితే ఈ సిరీస్ లోని ఒక వార్ సీక్వెన్స్ ను తీసుకుంటే.. శత్రువులను చెదరగొట్టడానికి గుర్రాలకు నిప్పంటించి వాటిని శత్రువుల స్థావరాల్లోకి వదులుతారు.

సేమ్ టు సేమ్ ఇప్పుడు బాహుబలి 2 సినిమాలో కూడా కుంతల రాజ్యాన్ని కాపాడటానికి కట్టప్ప కూడా ఆవులు గెదెల కొమ్ములకు నిప్పంటించి వాటిని శత్రుమూకలు మీదకి వదులుతాడు. అందుకే ”మార్కోపోలో”లో ఈ సీన్ తాలూకు వీడియో చూపించి.. రాజమౌళి ఇది కాపీ కొట్టేశాడు అంటూ జనాలు హడావుడి చేస్తున్నారు. అయితే ఎద్దుల కొమ్ములకు నిప్పంటించి ఇలా శత్రువులపై దాడి చేయడం అనేది భారత దేశంలో చాలామంది రాజులు అనాధిగా పాటించిన ఒక యుద్ద పద్దతి. దీనిని కాపీ అనడంలో పెద్దగా అర్ధం లేదేమో.

{youtube}WHy6RnQ2wFQ{/youtube}

Related

  1. బాహుబలి 2 సంచలన రికార్డు.. కేవలం మూడు రోజుల్లో 500 కోట్లు
  2. బాహుబలి 2 చూసిన చిరు.. ఏమన్నారో తెలుసా…?
  3. బాహుబలి 2 లో ప్రేక్షకులకు నచ్చని అంశాలు ఇవే
  4. స్టార్ డైరెక్టర్ కి బాహుబలి టికెట్ దొరకలేదు.. మరి ఏం చేసాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -