కమెడియన్ అలీకి నోటి దూల ఎక్కువని ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. పలు పబ్లిక్ ఈవెంట్‌లలో ఆడవారి గురించి చులకనగా,అసభ్యకరంగా మాట్లాడాడు ఆలీ. తాజాగా ఓ సినిమా ఆడియో ఈవెంట్‌లో అలీ సుమ గురించి, సుమ భర్త రాజీవ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘లవర్స్ డే’ ఆడియో లాంచ్‌లో హీరోయిన్ ప్రియా ప్రకాష్‌ను వేదిక మీదకు పిలిచే క్రమంలో .. ప్రియా ప్రకాష్‌ను తన చెల్లెలుగా అభివర్ణించింది సుమ. పక్కనే ఉన్న ఆలీ మైక్ తీసుకుని ప్రియా వారియర్ నీ చెల్లెలు అయితే హీరో రోషన్ మీ కొడుకా అని సుమని ప్రశ్నించాడు అలీ.
దీనికి సుమ అవునని సమాధానం ఇచ్చింది. వెంటనే ఆలీ రాజీవ్ ఎప్పుడు కేరళ వెళ్లాడు అని డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు అలీ. రాజీవ్‌కు ఇంత పెద్ద కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో… అని హేళన చేశాడు. తాజాగా ఈ వివాదంపై నటి దివ్యవాణి స్పందించింది. అలీ ఏంటో తనకు తెలుసు..ఆయన మనసులో ఎలాంటి ఉద్దేశాలు లేకపోయినా కూడా అలా అనుకోకుండా నోరుజారి వివాదాల్లో ఇరుక్కోవడం బాగా అలవాటు అయిపోయింది అని చెప్పింది. అలీ గతంలో నన్ను కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడని ఆసమయంలో అలీని నరకాలన్నంత కోపం వచ్చిందని చెప్పుకొచ్చింది దివ్యవాణి.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్