నేను సుమతో విడిపోలేదు.. కొంతకాలం విడిగా ఉన్నా.. కారణం ఏమిటంటే?

తెలుగులో టాప్​ యాంకర్​ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే ఆన్సర్​ సుమ కనకాల. ఎక్కడో కేరళలో జన్మించిన సుమ.. తెలుగు నేర్చుకొని ఇక్కడ స్టార్​ యాంకర్​గా పేరు సంపాదించుకున్నది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో టీవీలో సీరియల్స్​లో చిన్న చిన్న పాత్రలు చేసేది. ఆ తర్వాత యాంకరింగ్​లో అడుగుపెట్టాక.. ఇక తిరుగులేని క్రేజ్​ సంపాందించింది. కేవలం ఆమె కోసమే టీవీ షోలు చూసేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ఈటీవీలో వచ్చిన స్టార్​మహిళ షోను చాలా ఏళ్లపాటు సుమ ఒంటిచేత్తో నడిపించింది. ఇక చాలా కాలం పాటు ఎక్కడ ఏ సినిమా ఫంక్షన్​ జరిగినా సుమే కనిపించేది. ఇక ఆమె భర్త రాజీవ్​ కనకాల కూడా మంచి నటుడే. రాజీవ్​ తండ్రి దేవదాస్​ కనకాల గొప్ప నటుడు, శిక్షకుడు కూడా.

ఇదిలా ఉంటే సుమ.. రాజీవ్​ కనకాల విడిపోయారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వీళ్లిద్దరూ క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు ఆగలేదు. తాజాగా ఈ విషయంపై రాజీవ్​ కనకాల స్పందించారు. ‘ సుమ ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే కారణం ఆమె ప్రతిభ. నేను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఇక నేను సుమ విడిపోయామంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అందులో ఏ మాత్రం నిజం లేదు. అయితే మేము కొంతకాలం విడిగా ఉన్నాం. దీంతో చాలా మంది మేము విడిపోయామని భావించారు.

మా నాన్న దేవదాస్​ కనకాల మణికొండలో ఉండేవారు. మేము ఎల్​అండ్​టీ అపార్ట్స్​మెంట్​లో ఉండేవాళ్లం. అయితే అమ్మ చనిపోయాక.. నాన్నను మా దగ్గరకు తీసుకుపోవాలని ట్రై చేశాం. కానీ ఆయన లైబ్రరీ చాలా పెద్దగా ఉంది. ఆయనతో పాటు ఆ లైబ్రరీ మొత్తం మా అపార్ట్​మెంట్​కు తీసుకురావడం కుదరలేదు. లైబ్రరీ లేకుండా తాను రాలేనని నాన్న చెప్పారు. దీంతో నేను కొంతకాలం పాటు మా నాన్న దగ్గర ఉన్నాను. సుమ పిల్లలు అపార్ట్​మెంట్ లో ఉండేవాళ్లు. దీంతో మా మీద పుకార్లు వచ్చాయి’ అంటూ వివరణ ఇచ్చాడు రాజీవ్​ కనకాల.

Related Articles

Most Populer

Recent Posts