Friday, May 10, 2024
- Advertisement -

డేటింగ్ యాప్ లో ఫొటోతో నటికీ వేధింపులు.. చివరికి?

- Advertisement -

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే నటీనటులకు తరచూ నెటిజన్ల ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొందరు ఆకతాయిలు చేసే అల్లరి పనులకు ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో వేదింపులకు గురి అవుతుంటారు. ఈ క్రమంలోనే సినీ నటి గీతాంజలి సైతం ఈ విధమైనటువంటి వేధింపులు తప్పలేదు.

కొందరు పోకిరి వెదవలు తన ఫోటోలను డేటింగ్ యాప్ లో పెట్టారని, సినీ నటి గీతాంజలి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.డేటింగ్ యాప్ లో తన ఫోటోలను పెట్టడమే కాకుండా తనను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఎంతోమంది ఆకతాయిలు తనకు ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారంటూ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గీతాంజలి పేర్కొన్నారు.

Also read:సినిమా ప్లాప్ అయ్యింది.. మొత్తం డబ్బు మహేష్ బాబు వెనక్కి ఇచ్చి నన్ను కాపాడాడు: నిర్మాత అభిషేక్ నామా!

ఈ క్రమంలోనే గీతాంజలి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ సెలబ్రిటీల ఫోటోలను అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ విధంగా నటి తెలిపిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 501 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని, దర్యాప్తును కొనసాగిస్తామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

Also read:చావు బతుకుల్లో సీరియల్ నటి.. ఏకంగా అన్నిసార్లు సర్జరీ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -