Thursday, May 16, 2024
- Advertisement -

ఇది సమయం కాదు.. జూడాల సమ్మేపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

- Advertisement -

రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో జూనియర్ డాక్టర్ల సమ్మె చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పుడు ప్రజలు వైద్యులపై ఎంతో నమ్మకాన్ని ఉంచుకున్నారని.. సమ్మెకు ఇది సరైన సమయం కాదని.. సమ్మెను విరమించాలన్నారు. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరారు. జూనియర్‌ డాక్టర్ల విషయంలో తమ ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదన్న కేసీఆర్‌ జూడాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఇక, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలను 15శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోవిడ్‌ సేవల్లో ఉన్న వైద్య విద్యార్ధులకు కూడా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనమే అందించాలని ఆదేశించామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అంతే కాదు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే జూనియర్ డాక్టర్లకు మెరుగైన స్టైఫండ్‌ ఇస్తున్నామని అయినా, ఇలా సమ్మె పేరుతో విధులు బహిష్కరించడం సరైన పద్ధతి కాదని అన్నారు.

కాగా, హైదరాబాద్‌‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ దగ్గర జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. మెడికల్‌ కాలేజీ బయట జూడాలు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరావాలి, డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్ సర్.. మాటల్లో చెప్పినవి, చేతల్లో చేసి చూపించాలంటూ ఫ్లకార్డులు చేతపట్టారు. ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చారు. పెంచిన స్టైఫండ్‌, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలన్నది వారి డిమాండ్. ‌దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే.. ఈ నెల 28న కోవిడ్‌, అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని హెచ్చరించారు జూనియర్ డాక్టర్లు.

‘లైవ్’లో ఫోన్ నెంబర్ ఇచ్చిన శ్రీముఖి.. మీకు తెలుసా?

బాలయ్య బాబు ఏ బ్రాండ్ మందు తాగుతాడో తెలుసా?

మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆక్సిజ‌న్ బ్యాంకులు ప్రారంభం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -