Friday, May 9, 2025
- Advertisement -

లేటు వయసులో సినిమాల్లోకి మళ్లీ ఎంట్రీ..

- Advertisement -

లేటు వయసులో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది నటి మాళవిక. ఉన్నైతేడి’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమైన పలు సినిమాల్లో నటించింది. కొన్ని ఐటమ్ సాంగ్స్ లోనూ మెరిసింది. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతో సురేష్ అనే పారిశ్రామికవేత్తను పెళ్ళి చేసుకుని ముంబైలో సెలిటైపోయింది.

చాలా గ్యాప్ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలపెట్టబోతోంది. 42 ఏళ్ల వయసులో మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. పొన్ కుమరన్ దర్శకత్వంలో మిర్చి శివ- జీవా నటిస్తున్న మల్టీస్టారర్ హాస్యభరిత చిత్రం గోల్మాల్. ఇందులో ఓ కీలక పాత్రలో మాళవిక కనిపించబోతోంది.

ఈ సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, గ్లామర్ లేడీ విలన్ పాత్రల్లో ఛాన్స్ వస్తే నటించేందుకు సిద్ధమంటోంది. అందుకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మార్చుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -