Friday, May 3, 2024
- Advertisement -

‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ రివ్యూ..!

- Advertisement -

నాలుగు, ఐదు సినిమాలతో సరైన హిట్టు కొట్టలేకపోతున్న రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ తో హిట్ అందుకోవాలనుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : బుజ్జి అలియాస్ శ్రీను (రాజ్ తరుణ్)ది నిడదవోలు. కృష్ణవేణి (మాళవికా నాయర్) ది కూడా అదే ఊరు. ఇద్దరికి పరిచయం ఉండదు. అయితే ఒకే ట్రైన్ కృష్ణవేణి శ్రీను ఎక్కుతారు. అది చూసిన ఎవరో ఇద్దరూ కలిసి లేచిపోయారని పుకారు పుట్టిస్తారు. ట్రైన్ లో ఇద్దరికి పరిచయాలు ఏర్పడుతాయి. తన పేరు స్వాతి అని కృష్ణవేణి చెప్తుంది. బుజ్జిగాడు అసలు పేరు శ్రీను అని కృష్ణవేణికి తెలియదు. కృష్ణవేణి ఎలా ఉంటుందో బుజ్జి అలియాస్ శ్రీనుకి తెలియదు. వాళ్ళిద్దరికీ ఒకరి గురించి మరొకరికి ఎప్పుడు తెలిసింది? ఈలోపు ఊళ్లో ఏం జరిగింది? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : రాజ్ తరుణ్, మాళవికా నాయర్ ఇద్దరు చాలా చక్కగా నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. పోసాని కృష్ణమురళి, వీకే నరేష్ సప్తగిరి, మధునందన్, సత్యం రాజేష్, స్వామి రారా సత్య తదితరులు పాత్రలకు న్యాయం చేశారు. ఫస్ట్ ఆఫ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : దర్శకుడు ఎంచుకున్న కథలోనే కొత్తదనం లేదు. సినిమా రొటిన్ గా సాగిపోతుంది. సీన్స్ అన్ని మనం గత సినిమాల్లో చూసినట్లే అనిపిస్తోంది. రొటీన్ కామెడీ సన్నివేశాలతో తియ్యడం వలన ప్రేక్షకులకు విసుగు వస్తుంది. ‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీలో అసలు ట్విస్ట్ కనుకోవడం పెద్ద పనేం కాదు. డైలాగులు నవ్వించకపోగా చాలా సన్నివేశాల్లో వినిగిస్తాయి. ఎమోషన్స్ కూడా ఎక్కడా పండలేదు. ఎడిటింగ్ అసలు బాలేదు.

చివరగా : లాజిక్కులు, కథ వంటివి పక్కన పెడితే.. ఈ సినిమాని ఓ సారి చూడోచ్చు.

అర్దం చేసుకునే వ్యక్తి వస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటా : దేవి నాగవల్లి

’నిశ్శబ్దం’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్ లో గాయపడిన అవినాష్.. ఏం జరిగింది ?

కమెడియన్ సుధాకర్ కొడుకు ఇప్పుడెలా ఉన్నాడో చూడండి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -